ఇటీవల యువ కథానాయకుడు నిశ్చితార్థం చేసుకున్నాడు. పల్లలవి వర్మ అనే డాక్టర్‌తో ఎప్పటినుంచో ప్రేమలో ఉన్న నిఖిల్.. మొత్తానికి ఆమెనే వివాహమాడబోతున్నాడు. ఏప్రిల్ 16న హైదరాబాద్‌లో నిఖిల్, పల్లవిల పెళ్లి ఘనంగా జరగబోతోంది. తాజాగా ఓ సందర్భంలో నిఖిల్ తన లవ్‌స్టోరీ గురించి ఆసక్తికరమైన విషయం ఒకటి చెప్పాడు. పల్లవి ఇంట్లో ముందు పెళ్లికి ఒప్పుకోలేదట. కానీ ఎలాగోలా తానే ఒప్పించాడట. ‘‘ఐదు నెలల క్రితం నేను పల్లవిని ఓ పార్టీలో కలిశాను. తనని చూడగానే లవ్ ఎట్ ఫస్ట్ సైట్. కామన్ ఫ్రెండ్ ద్వారా ఆమె నెంబర్ తీసుకున్నాను. ఆ తర్వాత ఇద్దరం ఫ్రెండ్స్ అయ్యాం. పల్లవికి నేనంటో ఇష్టం అని అర్థమైంది. తను నాకు పర్‌ఫెక్ట్ అని ఎప్పుడో అర్థమైంది. కానీ నేనే క్లారిటీ వచ్చాక మా ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లాలనుకున్నా. అయితే పల్లవి ఇంట్లో వాళ్లు మాత్రం మా ప్రేమను అంగీకరించలేదు. అప్పుడు మా అమ్మే వారితో మాట్లాడి ఒప్పించింది. ఎంగేజ్‌మెంట్ అయ్యాక నేను పల్లవికి ఐఫోన్, చాకొలెట్ డబ్బా కానుకగా ఇచ్చాను’ అని తెలిపారు. READ ALSO: ఇక ఆయన కెరీర్ విషయానికొస్తే ఇటీవల ‘అర్జున్ సురవరం’తో చాలాకాలం తర్వాత ఓ హిట్ అందుకున్నారు నిఖిల్. త్వరలో ఆయన ‘కేశవ’ సినిమాకు సీక్వెల్‌లో నటించనున్నారని వార్తలు వస్తున్నాయి. బహుశా పెళ్లి తర్వాత నిఖిల్ తన తదుపరి సినిమాను ప్రకటించే అవకాశం ఉంది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2ScwmKp
No comments:
Post a Comment