అక్కినేని వారసుల్లో నాగార్జున తర్వాత అంతటిస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నవారు లేరనే చెప్పాలి. నాగ్ పెద్ద కుమారుడు నాగ చైతన్య ఇప్పుడిప్పుడు గాడిలో పడుతున్నాడు. అయితే ఆయనకు సోలోగా ఒక్క మంచి హిట్ లేదు. భార్య సమంతతో కలిసి నటిస్తే తప్ప ఆయన సినిమాలు ప్రేక్షకుల్లోకి వెళ్లడంలేదు. మరోపక్క రెండో వారసుడు అఖిల్ పరిస్థితి ఇంకా దారుణమనే చెప్పాలి. ‘అఖిల్’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన దారుణమైన పరాజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత ‘హలో’ సినిమా చేశాడు. ఈ సినిమా ఫర్వాలేదనిపించింది. మూడో సినిమా ‘మజ్ను’తో మళ్లీ తప్పులో కాలేశారు. కథల ఎంపికపై అఖిల్‌కి ఇంకా పట్టు రాలేదని క్లియర్‌గా అర్థమవుతోంది. అందుకే ఈసారి గట్టిగా కొట్టాలని ప్రయత్నిస్తున్నారు. తన నాలుగో సినిమతోనైనా ప్రేక్షకుల చేత శెభాష్ అనిపించుకోవాలని చూస్తున్నాడు. రేపు సాయంత్రం అఖిల్ తన కొత్త సినిమాకు సంబంధించిన ప్రకటన చేయనున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ నటించబోతున్నాడు. ఈ సినిమాకు ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ అనే టైటిల్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాస్, వాసు వర్మ నిర్మించనున్నారు. READ ALSO: అల్లు అరవింద్ సమర్పకులుగా వ్యవహరిస్తారు. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. గోపీ సుందర్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమాపై కూడా పెద్దగా అంచనాలు లేవు. ఎందుకంటే.. బొమ్మరిల్లు భాస్కర్ చిత్ర పరిశ్రమకు పెద్దగా హిట్ సినిమాలు ఏవీ ఇవ్వలేదు. చెప్పాలంటే గత కొన్నేళ్లలో ఆయన తెరకెక్కించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యాయి. దాంతో పెద్ద హీరోలు ఆయనతో సినిమా చేయాలంటే సంకోచిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే అఖిల్ కోసం ఓ కథ రాసుకున్నట్లున్నారు. కనీసం ఈ సినిమా ద్వారానైనా అఖిల్‌కు భాస్కర్‌కు ఓ హిట్ వస్తుందేమో చూడాలి. READ ALSO:
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3aYYFTM
No comments:
Post a Comment