Sunday 16 February 2020

ఒక్కో థియేటర్‌లో కోటి.. అల్లు అర్జున్ ‘అల’ మరో అరుదైన రికార్డ్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో పాటు నాన్ బాహుబలి రికార్డులన్నింటినీ తిరగరాసేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా సుమారు రూ.160 కోట్ల షేర్ వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లోనే సుమారు రూ.130 కోట్ల షేర్ రాబట్టింది. ఇప్పటికే పలు రికార్డులను కొల్లగొట్టిన ‘అల’.. ఇప్పుడు మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. విడుదలైన సెంటర్‌లోని రెండు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో కోటి రూపాయలకు పైగా గ్రాస్ వసూలు చేసిన తొలి చిత్రంగా ‘అల వైకుంఠపురములో’ నిలిచింది. ఈ రికార్డుకు విశాఖపట్నం వేదికైంది. వైజాగ్‌లోని మెలోడి, శరత్ థియేటర్లలో కోటి రూపాయలకు పైగా గ్రాస్‌ను ‘అల’ వసూలు చేసింది. మెలోడి థియేటర్‌లో 28 రోజుల్లో రూ. 1,00,98,121 వసూలు చేసిన ఈ సినిమా.. శరత్‌ థియేటర్‌లో 35 రోజుల్లో రూ. 1,00,18,228 రాబట్టింది. మొత్తం మీద ‘అల వైకుంఠపురములో’ సినిమా ఇటు అల్లు అర్జున్‌తో పాటు అటు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిపోయింది. ఈ సినిమాకు తమన్ సంగీతం సమకూర్చిన విషయం తెలిసిందే. గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లపై అల్లు అరవింద్, కె.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రపంచ వ్యాప్తంగా రూ. 85 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా అంతకు రెండింతలు రాబట్టింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2OZI0pI

No comments:

Post a Comment

'We Are Lucky To Have Modi'

'We don't have to go abroad for anything.' from rediff Top Interviews https://ift.tt/lL8j2sy