Sunday 9 February 2020

కరీనా కపూర్ హెయిర్ స్టైల్.. ఈజీగా మీరూ ట్రై చేయొచ్చు..

అందం విషయంలో కేశాలు కూడా ప్రధానం. ఎందుకంటే అందమైన జుట్టు వారి అందాన్ని మరింత పెంచుతుంది. అందమైన పొడవాటి జుట్టు కలిగి ఉండాలని ప్రతి అమ్మాయి డ్రీమ్. కానీ చాలా కొద్ది మంది మాత్రమే ఈ కలను నెరవేర్చుకోగలరు. పొడవైన మరియు ఒత్తైన జుట్టు ఉంటే ఎటువంటి జడ అయినా వేసుకోవచ్చు. ఎలా అయినా అలంకరించుకోవచ్చు. అదే చిన్న జుట్టు విషయానికి వస్తే, ఏ జడ వేసుకోవాలా అని ఆలోచిస్తాం. ముఖ్యంగా లంగా ఓణీ లాంటి దుస్తులపై చిన్న జుట్టుకు ఎటువంటి జడ వేసుకుంటే బాగుంటుందా అనేదే పెద్ద సమస్య. అయితే మీరు మీ చిన్న జుట్టు కోసం హెయిర్‌స్టైల్స్ ఎలాంటివి అయితే బాగుంటాయని ఆలోచిస్తుంటే.. మీ కోసం హెయిర్ స్టైల్స్ గురించి ఇక్కడ తెలుసుకోండి.. కరీనా కపూర్ అంటే అందానికి నిర్వచనం. ఆమె స్టైల్స్‌ని చాలా మంది ఫాలో అవుతారు. ఎందుకంటే ఆమె స్టైల్ లో ట్రెండ్ సెట్ చేస్తారు. ఆమె దుస్తులు, హెయిర్ స్టైల్ అన్ని విభిన్నంగా ఉంటాయి అందుకే అనేక సౌందర్య ఉత్పత్తుల సంస్థలకి ఆమె బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తారు. ఆమె ఏమి చేసినా ప్రత్యేకంగానే ఉంటుంది. అందుకే అనేక కరీనా లా రెడీ అవ్వాలని అనుకుంటారు. అయితే మీరు కూడా అందమైన కరీనాలా కనిపించాలని అనుకుంటున్నారా. అయితే మీరు కరీనా వేసుకున్న హెయిర్ స్టైల్ ని ట్రై చెయ్యండి. తాజాగా కరీనా కపూర్ ఓ పెళ్లి లో వేసుకున్న హెయిర్ స్టైల్ చాలా అందంగా ఉంది. ఆమె తన లెహెంగాలో సగం టై మరియు ఓపెన్ హెయిర్‌స్టైల్‌ను వేసుకున్నారు. అందుకే కరీనా హెయిర్ స్టైల్ సింపుల్ గా మీ కోసం.. రకరకాల జడలు వేసుకోవాలని ఉన్నా , కష్టమనే ఆలోచనతో కాస్త వెనక్కి తగ్గుతాం.. కానీ ఈ జడ చాలా ఈజీ... కింద పేర్కొన్న స్టెప్స్ ఫాలో అయితే చాలు.. సులువుగా వేసుకోవచ్చు... ఏం చేయాలంటే.. ముందుగా మీరు మీ జుట్టును కర్ల్స్ లేదా స్ట్రెయిట్ గా ఉంచుకోండి, తరువాత మీ జుట్టును స్టైలింగ్ చేయండి.. స్ట్రెయిట్ చేసిన తర్వాత, దువ్వెనతో మీ జుట్టులో మధ్య పాపిడి తిసి రెండు భాగాలుగా విభజించండి. ఇప్పుడు జుట్టు యొక్క ముందు భాగాన్ని తీసుకోండి. దాన్ని వేళ్ళతో చుడతూ చెవుల వెనుక నుంచి తీసుకొని పిన్ పెట్టాలి. రెండో భాగాన్ని తీసుకొని దాన్ని మెలితిప్పుతూ వెనుక భాగంలో పిన్ లు కనిపించకుండా పెట్టండి . ఇది చిన్న జుట్టు ముందుకు రాకుండా, మీ ముఖం మరింత అందంగా కనపడేందుకు సహాయపడుతుంది. చివరగా, జుట్టు చెరగకుండా ఉండేందుకు హెయిర్‌ సెట్టింగ్ స్ప్రేతో సెట్ చేయండి. మీకు పొడవైన జుట్టు ఉంటే, మీరు వెనుక వైపు రెండు వైపులా క్లిప్ పెట్టండి, హెయిర్ యాక్సెసరీతో అలంకరించొచ్చు. ఈ హెయిర్ స్టైల్ ను తక్కువ సమయంలో వేసుకోగలరు కాబట్టి.. మీరు ట్రై చేసి అందరిలో సెంటర్ అఫ్ అట్రాక్షన్ గా నిలవండి.


from Beauty Tips in Telugu: అందం చిట్కాలు, Homemade Natural Beauty Tips Telugu - Samayam Telugu https://ift.tt/2uAZX70

No comments:

Post a Comment

'Critics Wait 20 Years To Like My Films'

'Whenever people say to me that all my work looks unique, I say to them originality is the art of concealing your source.' from re...