మ్యాచోస్టార్ గోపీచంద్ హీరోగా మాస్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘సీటీమార్’. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్, అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందుతోన్న ఈ మూవీలో మిల్కీబ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటిస్తున్నారు. తరుణ్ అరోర ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘సీటీమార్’ ఫస్ట్ లుక్ పోస్టర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా, ఈ చిత్రం నుండి తాజాగా తమన్నా లుక్‌ను విడుదల చేశారు. కబడ్డీ కోచ్ జ్వాలా రెడ్డిగా మిల్కీబ్యూటీ లుక్ అదిరిపోయింది. సీరియస్ లుక్‌లో తమన్నా కొత్తగా కనిపిస్తున్నారు. జ్వాలా రెడ్డిగా తన లుక్‌పై తమన్నా మాట్లాడుతూ.. ‘‘చాలా ఆసక్తికరమైన, స్ఫూర్తిమంతమైన, ఛాలెంజింగ్ రోల్ కబడ్డీ కోచ్ జ్వాలా రెడ్డి. గోపిచంద్‌తో మొదటిసారి కలిసి నటిస్తున్నాను. అలాగే, సంపత్ నంది దర్శకత్వంలో ‘రచ్చ’, ‘బెంగాల్ టైగర్’ తర్వాత చేస్తోన్న సినిమా ఇధి. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బేనర్‌లో చేయడం చాలా హ్యాపీగా ఉంది’’ అని అన్నారు. Also Read: చిత్ర నిర్మాత శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ.. ‘‘రాజమండ్రి షెడ్యూల్ పూర్తి చేసుకొని ఆర్ఎఫ్‌సీలో కొత్త షెడ్యూల్ ప్రారంభించాం. ఈ షెడ్యూల్‌లో తమన్నా జాయిన్ అయ్యారు. నాన్ స్టాప్‌గా షెడ్యూల్ జరిపి సమ్మర్ స్పెషల్‌గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. గోపిచంద్ కెరీర్‌లోనే ఇది హై బడ్జెట్, భారీ కమర్షియల్ ఫిలిం. సంపత్ నంది హై టెక్నికల్ వేల్యూస్‌తో ప్రెస్టీజియస్‌గా ఈ మూవీని రూపొందిస్తున్నారు’’ అని వెల్లడించారు. కాగా, ఈ చిత్రంలో దిగంగన సూర్యవన్షి, తరుణ్ అరోర, భూమిక, పోసాని కృష్ణమురళి, రావురమేష్, అన్నపూర్ణమ్మ, ప్రగతి తదితరులు నటిస్తున్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/39mzYPH
No comments:
Post a Comment