Thursday 20 February 2020

మాస్ మహారాజా శివరాత్రి గిఫ్ట్.. అబ్బాయిలూ గెట్ రెడీ!

మాస్ మ‌హారాజా ర‌వితేజ‌ తన అభిమానులకు శివరాత్రి గిఫ్ట్ ఇస్తున్నారు. ఆయన హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘క్రాక్’ టీజర్ ఈరోజు విడుదల కాబోతోంది. సాయంత్రం 6.03 గంటలకు ‘క్రాక్’ టీజర్‌ను విడుదల చేస్తున్నారు. ఈ మేరకు ‘క్రాక్’ టీమ్ తరఫున మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ శుక్రవారం ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో టీజర్‌ను విడుదల చేసే సమయాన్ని కూడా పేర్కొన్నారు. మొత్తానికి ఈరోజు సాయంత్రం రవితేజ తన ‘క్రాక్’తో కేక పుట్టిస్తారన్న మాట. ఇదిలా ఉంటే, ‘క్రాక్’ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. ‘డాన్‌శీను’, ‘బ‌లుపు’ చిత్రాల త‌ర్వాత రవితేజ-గోపీచంద్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న హ్యాట్రిక్ మూవీ ఇది. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ చివరి దశకు చేరుకుంది. ర‌వితేజ ఈ చిత్రంలో ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టిస్తున్నారు. రవితేజ సరసన శృతిహాసన్ హీరోయిన్‌గా కనిపించనున్నారు. ‘బలుపు’ తరవాత వీరిద్దరూ మరోసారి జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుద‌లైన పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి మంచి వ‌చ్చింది. న్యూ ఇయర్ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ బాగా వైరల్ అయ్యింది. ఖాకీ యూనిఫామ్ వేసుకుని, చేతిలో గోలీసోడా బుడ్డిని ప‌ట్టుకుని ఒక కంటికి అడ్డంగా పెట్టుకున్న ఇంటెన్స్ లుక్‌లో ర‌వితేజ అదిరిపోయారు. ఆ తర్వాత సంక్రాంతికి వచ్చిన ఫ్యామిలీ పోస్టర్‌కు కూడా సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఇలా ఇప్పటి వరకు విడుదలైన ప్రతి పోస్టర్ కట్టిపడేశాయి. Also Read: కాగా, తెలుగు రాష్ట్రాల్లో జ‌రిగిన య‌థార్థ ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని అన్ని వ‌ర్గాల ప్రేక్షకుల‌ను మెప్పించేలా కమర్షియల్ ఎలిమెంట్స్‌తో డైరెక్టర్ గోపీచంద్ మ‌లినేని ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. మే 8న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. స‌ర‌స్వతి ఫిలిమ్ డివిజ‌న్ బ్యాన‌ర్‌పై బి.మ‌ధు నిర్మిస్తోన్న ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేష‌న్ త‌మ‌న్ సంగీత సార‌థ్యం వ‌హిస్తున్నారు. స‌ముద్రఖ‌ని, వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవీ ప్రసాద్‌, పూజిత పొన్నాడ‌, చిరాగ్ జాని, మౌర్యాని, హ్యాపీడేస్ సుధాక‌ర్‌, వంశీ చాగంటి ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2vUT7tG

No comments:

Post a Comment

'Markets Not In Panic Yet, But...'

'If you see another 1000-point correction, people may start panicking.' from rediff Top Interviews https://ift.tt/RjF0mDo