Saturday, 1 February 2020

వర్మ కొత్త సినిమా.. ఈసారి సరైన టాపిక్ ఎంచుకున్నారు

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ‘దిశ’ ఘటనను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాం. తెలంగాణకు చెందిన వెటర్నరీ వైద్యురాలిని నలుగురు వ్యక్తులు మద్యం తాగించి దారుణంగా రేప్ చేసి సజీవదహనం చేయడంతో తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. తెలంగాణ పోలీసులు దిశ నిందితులను కాల్చి చంపినా ఇంకా ఆ ఘటన తెలుగు ప్రజల కళ్ల ముందు మెదులుతూనే ఉంది. అందుకే ఈసారి సెన్సేషనల్ దర్శకుడు ‘దిశ’ ఘటనను తన తర్వాతి సినిమా కాన్సెప్ట్‌గా ఎంచుకున్నారు. ఈ విషయాన్ని వర్మ ట్విటర్ ద్వారా ప్రకటించారు. READ ALSO: ‘‘నా తర్వాతి సినిమా పేరు ‘దిశ’. దిశ రేప్ ఘటన గురించి ఈ సినిమా ఉండబోతోంది. ‘నిర్భయ’ హత్యాచారం తర్వాత అంతకంటే దారుణంగా ఓ ఆడపిల్లలను రేప్ చేసి సజీవదహనం చేశారు. ఒకప్పటి రేపిస్ట్‌ల నుంచి కొత్తగా వస్తున్న రేపిస్ట్‌లు ఏం నేర్చుకుంటున్నారో ‘దిశ’ సినిమాలో భయంకరమైన గుణపాఠంగా చెప్పబోతున్నాను. నిర్భయను రేప్ చేసి రోడ్డు మీద వదిలేసి వెళ్లిపోయారు. అలా చేస్తే శిక్ష పడదు అనుకున్నారు. కానీ పోలీసులు పట్టుకున్నారు. అలాంటి పరిస్థితి తమకు ఎదురుకాకూడదని దిశను రేపిస్ట్‌లు కాల్చి చంపేశారు’’ అని వెల్లడించారు. అంతేకాదు ‘నిర్భయ’ దోషులను ఈరోజే ఉరి వేయాల్సి ఉంది. కానీ నిర్భయ దోషుల తరఫు న్యాయవాది ఏపీ సింగ్ పిటిషన్ వేసి స్టే విధించేలా చేశారు. దీనిపై వర్మ స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నిర్భయను జంతువుల్లాంటి వ్యక్తులు రేప్ చేశారు. ఇప్పుడు ఆమెను మన న్యాయవ్యవస్థ రేప్ చేస్తోంది. మిస్టర్ నరేంద్ర మోదీ.. నిర్భయ తల్లిదండ్రుల బాధను మీరు అర్థం చేసుకోగలరా? అన్ని కోర్టులు కలిసి దోషులకు ఉరి పడకుండా చేస్తున్నాయి. నిర్భయ దోషుల తరఫు న్యాయవాది ఏపీ సింగ్ నిర్భయ తల్లికి సవాలు విసిరాడట. దోషులకు ఎప్పటికీ ఉరి పడదు అని అన్నాడట. వినడానికి ఇంతకంటే దరిద్రమైన విషయం మరొకటి ఉండదు. ఏపీ సింగ్ లాంటి నీచమైన లాయర్ కూడా న్యాయవ్యవస్థను తనవైపు తిప్పేసుకుంటున్నాడు. దీనిని బట్టి క్లియర్‌గా అర్థమైందేంటంటే.. ప్రజలకు న్యాయవ్యవస్థపై కంటే తెలంగాణ పోలీసులపైనే ఎక్కువ నమ్మకం ఉంది’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2GIYKx5

No comments:

Post a Comment

'Never Be Another Zakir Hussain'

'Zakir <em>bhai</em> always said, '<em>koi chala nahi jata hai</em>', he believed even after death, you ...