
కమల్ హాసన్ నటిస్తోన్న ‘ఇండియన్ 2’ సినిమా షూటింగ్‌లో ప్రమాదం జరిగి ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై చెన్నై పోలీసులు కేసు నమోదు చేశారు. చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌పై ఐపీసీలోని నాలుగు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. అలాగే, నటుడు కమల్ హాసన్, దర్శకుడు శంకర్‌కు సమన్లు జారీ చేశామని చెప్పారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఇండియన్ 2’ తాజా షెడ్యూల్ ఇటీవల చెన్నైలో ప్రారంభమైంది. ఇది ఐదురోజుల షెడ్యూల్. ఈ షెడ్యూల్‌లో భాగంగా భారీ క్రేన్ సహాయంతో షూటింగ్ జరుపుతున్నారు. బుధవారం రాత్రి ఈ క్రేన్ ప్రమాదవశాత్తు కూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు సిబ్బంది అక్కడికక్కడే మరణించారు. మరో తొమ్మిది మంది గాయపడ్డారు. చనిపోయినవారిలో అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణన్ (35), ఆర్ట్ అసిస్టెంట్ చంద్రు (58), ప్రొడక్షన్ అసిస్టెంట్ మధు (27) ఉన్నారు. Also Read: ఈ ఘటనపై చెన్నైలోని పూనమళ్లీ పోలీసులు ఎ.సుబస్కరన్‌కు చెందిన లైకా ప్రొడక్షన్ సంస్థపై కేసు నమోదు చేశారు. నిర్మాతతో పాటు క్రేన్ యజమాని, క్రేన్ ఆపరేటర్‌పై కూడా కేసులు పెట్టారు. ఇండియన్ పీనల్ కోడ్‌లోని సెక్షన్ 287 (యంత్రాల విషయంలో నిర్లక్ష్యం వహించడం), సెక్షన్ 337 (ఇతరుల జీవితానికి, వ్యక్తిగత భద్రతకు హాని కలిగించడం), సెక్షన్ 338 (ఇతరుల జీవితానికి, వ్యక్తిగత భద్రతకు తీవ్ర హాని తలపెట్టడం), సెక్షన్ 304ఎ (నిర్లక్ష్యం కారణంగా మరణం) కింద కేసులు నమోదు చేసినట్టు పోలీసులు స్పష్టం చేశారు. కాగా, సెట్స్‌లో క్రేన్ కూలిపోయిన ముగ్గురు సిబ్బంది చనిపోవడం తమిళ ఇండస్ట్రీతోపాటు అందరినీ షాక్‌కు గురిచేసింది. ఈ ప్రమాదం నుంచి వెంట్రికవాసిలో తప్పించుకున్నామని కమల్ హాసన్, కాజల్ అగర్వాల్ వెల్లడించారు. బుధవారం రాత్రి 10 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే, ప్రమాదంలో మృతిచెందిన వారికి కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని ఇప్పటికే కమల్ ప్రకటించారు. హాస్పిటల్‌లో చికిత్సపొందుతున్న క్షతగాత్రులను గురువారం ఆయన పరామర్శించారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2T6k31v
No comments:
Post a Comment