Sunday, 4 August 2019

‘బిగ్ బాస్’ నుంచి జాఫర్ ఔట్.. హౌజ్‌మేట్స్‌కి భావోద్వేగ వీడ్కోలు!

‘బిగ్ బాస్’ తెలుగు రియాలిటీ షో మూడో సీజన్‌లో రెండో ఎలిమినేషన్‌కు సమయం ఆసన్నమైంది. ఆదివారం ఒక కంటెస్టెంట్ హౌజ్‌లో నుంచి బయటికి రాబోతున్నారు. మొత్తం ఎనిమిది మంది కంటెస్టెంట్స్ (వరుణ్ సందేశ్, వితికా షెరు, రాహుల్ సిప్లిగంజ్, , శ్రీముఖి, హిమజ, పునర్నవి, మహేష్ విట్ట) ఎమిలినేషన్‌కు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. అయితే, వీరిలో నలుగురిని శనివారం నాటి ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున సేఫ్ జోన్‌లో పడేశారు. మొదట మహేష్ విట్టను సేఫ్ జోన్‌లో వేసిన నాగార్జున.. ఆ తరవాత హిమజ, రాహుల్, శ్రీముఖిలు సేఫ్ అని ప్రకటించారు. దీంతో వితికా, వరుణ్, జాఫర్, పునర్నవిలలో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారన్నది సస్పెన్స్‌గా మారింది. వితికా షెరు ఎలిమినేట్ కావడం ఖాయమని చాలా మంది భావించారు. సోషల్ మీడియాలో కూడా వితికాకు వ్యతిరేకంగా బోలెడంత ప్రచారం జరుగుతోంది. అయితే, ఆమె సేఫ్ అని అంటున్నారు. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ఈ వారం హౌజ్ నుంచి ఎలిమినేట్ అయ్యింది జాఫర్ అని తెలిసింది. ఇదే విషయాన్ని ఆదివారం రాత్రి ‘బిగ్ బాస్’ ప్రేక్షకులు బుల్లితెరపై చూడబోతున్నారని సమాచారం. ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా ఇదే విషయం హాట్ టాపిక్‌గా నడుస్తోంది. జాఫర్ ఎలిమినేట్ అయిపోయారని చాలా మంది సోషల్ మీడియాలో అంటున్నారు. హేమ ఎలిమినేట్ అయినప్పుడు కూడా ముందుగా బయటికి వచ్చిన సమాచారం నిజమైంది. కాబట్టి, ఇది కూడా జరిగితీరుతుందని అంటున్నారు. వాస్తవానికి జాఫర్ హౌజ్‌లో అంత యాక్టివ్‌గా ఉండటం లేదు. కేవలం బాబా భాస్కర్‌తో మాత్రమే సన్నిహితంగా ఉంటున్నారు. మిగతా హౌజ్‌మేట్స్‌తో గొడవలేమీ లేవు కానీ అంటీముట్టనట్టు ఉంటున్నారు. అయితే, జాఫర్‌పై హౌజ్‌మేట్స్‌కు మాత్రం మంచి అభిప్రాయమే ఉంది. కానీ, ఇది సరిపోదట. ఆయన హౌజ్‌లో ఎలాంటి ప్రభావం చూపలేదుకాబట్టి ప్రేక్షకులు ఆయనకే తక్కువ ఓట్లు వేశారని టాక్. అంతేకాకుండా, ఇచ్చిన టాస్క్‌ను కూడా జాఫర్ పూర్తిచేయలేదు కాబట్టి ఎమిలినేషన్ ఖాయం అంటున్నారు. నిజం చెప్పాలంటే.. షోలో కొనసాగడం జాఫర్‌కు ఇష్టంలేదని తెలిసింది. ఆయన లోపల చాలా ఇబ్బందిగా ఫీలవుతున్నారట. ఎలాగైనా బయటికి వచ్చేయాలని అనుకుంటున్నారని సమాచారం. అందుకే, టాస్క్‌లు పూర్తిచేయకుండా.. హౌజ్‌మేట్స్‌తో కలిసిమెలిసి ఉండకుండా ఉంటే ప్రేక్షకులే తనను ఎలిమినేట్ చేసేస్తారని జాఫర్ భావించారట. ఎంతకాదనుకున్నా రెండు వారాలపాటు అందరితో కలిసి మెలిసి ఉన్నారు కాబట్టి ఇంటిలో నుంచి బయటికి వచ్చేటప్పుడు జాఫర్, ఇంటి సభ్యులు కాస్త భావోద్వేగానికి గురయ్యారట. ఇదే ఆదివారం రాత్రి వచ్చే ఎపిసోడ్‌లో ప్రేక్షకులు చూడబోతున్నారని సమాచారం.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/33bbQx6

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....