
తెలుగు సినీ పరిశ్రమలోని పెద్ద కుటుంబాల్లో మంచు ఫ్యామిలీ ఒకటి. మంచువారింట ఏ సంబరం జరిగినా అది ప్రత్యేకమే. మంచు విష్ణు, విరానికా దంపతులకు ఇటీవల నాలుగో సంతానంగా పాప జన్మించిన విషయం తెలిసిందే. ఈ పాపకు ఐరా విద్య అని నామకరణం చేశారు. తన మూడో కూతురు ఫొటోను ఇటీవల సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అప్పుడే పేరు కూడా వెల్లడించారు. అయితే, తాజాగా విష్ణు భార్య విరానికా సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు పోస్ట్ చేశారు. మొత్తం నాలుగు ఫొటోలను విరానికా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ ఫొటోల్లో తమ నలుగురు పిల్లలతో మంచు విష్ణు దంపతులు కనిపించారు. అలాగే నలుగురు తోబుట్టువులు కలిసి అందంగా ఫొటోలు దిగారు. ఈ ఫొటోలను ప్రముఖ ఫొటోగ్రాఫర్ స్మరిత విన్నకోట తీశారు. కుటుంబ సభ్యులంతా వైట్, లైట్ పింక్ డ్రెస్సుల్లో మెరిసిపోతున్నారు. ఐరా.. నాన్న భుజంపై హాయిగా నిద్రపోతోంది. అమ్మ హస్తాల్లో ఇమిడిపోయింది. అక్కల మధ్య హాయిగా బజ్జొని చూస్తోంది. Also Read: కాగా, విష్ణు దంపతులకు తొలి సంతానంగా కవల ఆడపిల్లలు వివియానా, అరియానా జన్మించిన సంగతి తెలిసిందే. ఆ తరవాత అవ్రామ్ జన్మించాడు. దీంతో, మంచువారింట వారసుడు పుట్టేశాడని అభిమానులు సంబరపడ్డారు. కానీ, విష్ణు దంపతులు మరోబిడ్డను కోరుకున్నారు. ఆగస్టు 9న మూడో ఆడబిడ్డకు విరానికా జన్మనిచ్చారు. ఇక సినిమాల విషయానికి వస్తే, ఈ ఏడాది విష్ణు ‘ఓటర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ సినిమా ఆకట్టుకోలేకపోయింది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2ZuMiNa
No comments:
Post a Comment