Saturday, 31 August 2019

‘సాహో’పై జోకులు.. కట్టప్ప అందుకే చంపాడట!

న్నో అంచనాలతో విడుదలైన ‘సాహో’ చిత్రం ప్రేక్షకులను నిరుత్సాహపరిచిన నేపథ్యంలో నెటిజనులు ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు. సినిమా చూసిన తర్వాత అంతా సోషల్ మీడియాను వేదికగా చేసుకుని మీమ్స్‌తో రివ్యూలు ఇవ్వడం ప్రారంభించారు. ఎక్స్‌పెక్టేషన్స్‌కు రియాలిటీకి మధ్య ఎంత తేడా ఉంటుందో చెబుతూ జోకులు పేలుస్తున్నారు. కొందరు నెటిజనులు ‘బాహుబలి’ సినిమాకు ముడిపెట్టి ‘సాహో’ను ట్రోల్ చేస్తున్నారు. కట్టప్ప బాహుబలిని చంపాడని అసలు కారణం ఏమిటో తెలిసిపోయిందని, బాహుబలి ‘సాహో’ చిత్రం చేయకూడదనే చంపేశాడని కామెంట్లు చేస్తున్నారు. అయితే, ఈ సినిమాపై ప్రస్తుతం మిశ్రమ స్పందనే నడుస్తోంది. చాలామంది సినిమా బాగాలేదని ట్రోల్ చేస్తున్నా.. కొందరు మాత్రం సినిమాలోని కొన్ని సన్నివేశాలు బాగా నచ్చేశాయని చెబుతున్నారు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలను ఇష్టపడే ప్రేక్షకులు ఈ సినిమాపై పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. ఇక ఫ్యాన్స్‌ అయితే పండుగ చేసుకుంటున్నారు. సినిమా బ్లాక్‌బాస్టర్ అని అంటున్నారు. ఈ సినిమాకు తొలి రోజు వసూళ్లు బాగానే ఉన్నా.. మున్ముందు ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాకపోవచ్చని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమా చూసిన నెటిజనులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల వైరల్‌గా చక్కర్లు కొడుతున్న ‘విపిన్ సాహూ పారాగ్లైడింగ్’ మీమ్‌ను సైతం వాడేస్తున్నారు. ఈ జోకులు చూస్తే మీరూ తప్పకుండా ఎంజాయ్ చేస్తారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2LcGCP8

No comments:

Post a Comment

'Don't Find Anything Wrong With Nepotism'

'Why would a star's son not become an actor?' from rediff Top Interviews https://ift.tt/wsEaB64