Tuesday, 27 August 2019

కూతురిని చూసి ఏడ్చేసిన స్టార్ హీరో

‘కేజీఎఫ్’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌డం సంపాదించుకున్న నటుడు యశ్. అభిమానులకు ఆయన ఎంత పెద్ద హీరో అయినా... ఆయనా ఓ బిడ్డకు తండ్రే. కొన్ని నెలల క్రితం దంపతులకు పండింటి ఆడపిల్ల జన్మించిన సంగతి తెలిసిందే. పాపకు ఐరా అని పేరు పెట్టారు. అయితే ఇటీవల యశ్ దంపతులు తమ కుమార్తెకు చెవులు కుట్టించే వేడుకను ఏర్పాటుచేశారు. పాపకు చెవులు కుట్టిస్తుంటే నొప్పి భరించలేక ఏడ్చేసింది. అది చూసి యశ్ కూడా కంటతడి పెట్టేసుకున్నారట. ఈ విషయాన్ని ఆయన భార్య రాధికా పండిత్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ‘ఐరాకు చెవులు కుట్టించాం. ఇలాంటి సమయంలో ప్రతీ తల్లిదండ్రులు ఎంతో ఉద్వేగానికి లోనవుతారు. యశ్ ఐరాను చూసి కన్నీరుపెట్టేశారు. రాక్‌స్టార్ కళ్లలో నీళ్లు చూడటం అదే మొదటిసారి. అప్పుడే నాకు తెలిసింది ఈ బంధాలు ఎంత విలువైనవో. కంగారుపడకండి. ఇప్పుడు తండ్రీ కూతుళ్లు ఇద్దరూ బాగానే ఉన్నారు’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం యశ్ ‘కేజీఎఫ్’ చాప్టర్ 2లో నటిస్తున్నారు. ‘కేజీఎఫ్’ సినిమాకు దర్శకత్వం వహించిన ప్రశాంత్ నీల్ చాప్టర్ 2ని కూడా తెరకెక్కిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ అధీరా అనే కీలక పాత్రను పోషిస్తున్నారు. మొదటి సినిమా రికార్డులకు ఈ సినిమా బ్రేక్ చేస్తుందో లేదో వేచి చూడాలి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Lbtt7H

No comments:

Post a Comment

'Balasaheb Thackeray Never Gave Up'

'In Independent India's politics you will not find any leader of a political party who has not contested elections or not held a pow...