దేశంలోనే అతిపెద్ద స్క్రీన్‌తో నిర్మించిన మల్టీప్లెక్స్‌ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నేడు (ఆగస్టు 29న) ప్రారంభించబోతున్నారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట సమీపంలోని దేశంలోనే అతిపెద్ద స్క్రీన్‌తో కూడిన థియేటర్‌ను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ‘సాహో’ చిత్రాన్ని నిర్మించిన యూవీ క్రియేషన్స్ సంస్థకు చెందిన ‘వి సెల్యులాయిడ్’ ఈ మల్టీప్లెక్స్‌ను నిర్మించింది. ‘వి ఎపిక్’ పేరుతో నిర్మించిన ఈ మల్టీప్లెక్స్.. సూళ్లూరుపేటకు నాలుగు కిలోమీటర్ల దూరంలో పిండిపాళెం వద్ద చెన్నై- కోల్‌కతా జాతీయ రహదారి పక్కన ఉంది. రూ.40 కోట్ల వ్యయంతో ఈ మల్టీప్లెక్స్‌ను నిర్మించారు. Also Read: ప్రభాస్ హీరోగా నటించిన ‘సాహో’ చిత్రంతో ‘వి ఎపిక్’ మల్టీప్లెక్స్‌లో ప్రదర్శనలు మొదలుకానున్నాయి. ఈ మల్టీప్లెక్స్‌ను ‘సాహో’ విడుదలకు ఒక్కరోజు ముందు అంటే గురువారం రామ్ చరణ్ ప్రారంభించనున్నారు. ఇప్పటికే మల్టీప్లెక్స్ వద్ద రామ్ చరణ్‌కు స్వాగతం పలుకుతూ అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. యూవీ క్రియేషన్స్‌లో రెబల్ స్టార్ ప్రభాస్‌కు కూడా షేర్ ఉన్న సంగతి తెలిసిందే. అందుకే ప్రభాస్ థియేటర్ ఓపెనింగ్‌కు రామ్ చరణ్ వస్తున్నారనే వార్త ఇప్పుడు వైరల్‌గా మారింది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా మొదటిసారిగా 106 అడుగుల వెడల్పు, 54 అడుగుల ఎత్తయిన స్క్రీన్‌తో ఈ మల్టీప్లెక్స్‌ను నిర్మించారు. ఈ థియేటర్‌లో 656 సీట్ల సామర్థ్యం ఉంది. 3డీ సౌండ్ సిస్టమ్ ఈ థియేటర్ ప్రత్యేకత. ఇప్పటి వరకు 106 అడుగుల వెడల్పు గల భారీ స్క్రీన్‌లు ప్రపంచంలో రెండు మాత్రమే ఉన్నాయి. ఆ కోవలో ఇది మూడోదని, ఆసియాలో రెండోదని థియేటర్ వర్గాలు పేర్కొన్నాయి. అలాగే ఇందులోనే ఒక్కోటి 170 సీట్ల సామర్థ్యంతో మరో రెండు స్క్రీన్‌లు ఏర్పాటు చేస్తున్నట్టు వారు తెలియజేశారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/344YVgA
No comments:
Post a Comment