Saturday, 31 August 2019

Saaho Review: కామన్ సెన్స్ లేదా.. ‘సాహో’ బాలేదంటారా? యాంకర్ రవి ఫైర్

‘సాహో’ సినిమా బాలేదంటూ నెగిటివ్ ప్రచారం చేసేవారిపై ఫైర్ అయ్యారు . దయచేసి సినిమా చూసి రివ్యూ ఇవ్వాలని.. వెయ్యిలో ఒకడికి సినిమా నచ్చకపోతే దాన్ని హైలైట్ చేయడం సరికాదని.. మీకు నచ్చకపోతే పోయేది రూ. 200 వందలే.. కాని కష్టపడి సినిమా తీసిన వాళ్లకు వందల కోట్లు నష్టం వస్తాయన్నారు’ యాంకర్ రవి. ఈ నెగిటివ్ రివ్యూస్‌పై ఫైర్ అవుతూ తన ఫేస్ బుక్‌ ద్వారా వీడియో వదిలారు రవి. ఇందులో రవి మాట్లాడుతూ.. ‘‘జై’ ..‘డార్లింగ్ ప్రభాస్ కంగ్రాట్స్, దర్శకుడు సుజీత్‌కి కంగ్రాట్స్.. యూవీ క్రియేషన్స్‌కి వారి ధైర్యానికి మెచ్చుకోవాలి. రూ. 350 కోట్లతో సినిమా తీయడం చిన్న విషయం కాదు. అయితే డార్లింగ్‌పై ఇంత ఖర్చుపెట్టారు కాబట్టి ఖచ్చితంగా తిరిగి వచ్చేస్తాయి. నేను సినిమా చూశా.. అదిరిపోయింది సాహో సినిమా నా స్నేహితులతో కలిసి చూశా. నాకు చాలా బాగా నచ్చింది. ఇంటర్నేషనల్ స్టాడర్డ్స్‌తో సినిమా చూపించారు. మన తెలుగు సినిమా ఈ స్థాయికి వెళ్లడం చాలా గర్వంగా ఉంది. నా గ్యాంగ్‌ని తీసుకుని ఈ సినిమాకు వెళ్లాను. నాతో పాటు వాళ్లందరికీ సినిమా చాలా బాగా నచ్చింది. ఈ వీడియో చేయడానికి రీజన్ ఇదే.. నేను ఈ మధ్య చాలా విషయాల్లో రియాక్ట్ కావడం మానేశా. వీడియోలు చేయడం మానేశా. కాని ఈరోజు నాకు మనసుకు చాలా బాధ కలిగింది. నేనెప్పుడూ పాజిటివ్ గురించే మాట్లాడుతుంటా. నేను హెయిర్ కట్ చేయించుకోవడానికి సెలూన్‌కి వెళ్లా.. అక్కడ చాలా మంది బాగుందని అంటుంటే.. ఒకడొచ్చి సినిమా బాలేదంట అన్నా తలనొప్పి అంట.. బోరింగ్ అంట అన్నాడు. సినిమాలో నీకు ఏం బాలేదు? ఎందుకు నచ్చలేదు అని అడిగా. ఏమో అన్నా నేను ఇంకా చూడలేదని అన్నాడు. మరి నువ్ ఎట్లా చెబుతావ్ బాలేదని అంత ఖచ్చితంగా ఎలా డిసైడ్ చేస్తావ్ అని అడిగా. లేదన్నా.. యూట్యూబ్‌లో చూశా.. ఎవరో రివ్యూ బాలేదని రాశారు. తలపోటు అంటున్నారు. అని ఆ వ్యక్తి చెప్పాడు. తప్పు వాళ్లదే.. క్లిక్స్ కోసం కక్కుర్తి.. ఎవడో ఏదో రాశాడని.. నువ్ సినిమా చూడకుండా బాలేదని చెప్పడం ఏంటో నాకు అర్ధం కాలేదు. అయితే ఇక్కడ తప్పు అతనిది అని నేను అనలేను. ఎవరైతే తప్పుడు రివ్యూలు పెడుతున్నారో.. పెద్ద పెద్ద హెడ్డింగ్స్‌తో యూట్యూబ్‌లో వ్యూస్ కోసం కక్కుర్తి పడుతున్నారో వాళ్లను అనాలి. సినిమా అందరికీ నచ్చాలని రూల్ లేదు. ఎవరో ఇద్దరు ఉంటారు.. వాళ్లకు సినిమా అర్ధం కాదు.. నచ్చలేదని చెప్తారు. వాళ్ల మాటను జనం నమ్ముతారు. ఎవరైతే మీడియాలో ఉండి.. యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ సినిమా బాలేదంటారో వాళ్లది తప్పు. మన తెలుగు సినిమా స్థాయి పెంచి.. ఇంటర్నేషనల్ స్థాయిలో యాక్షన్ సన్నివేశాలు చేస్తే సింపుల్‌గా బాలేదని అనేస్తున్నారు. వెయ్యిమందిలో ఒక్కడికి సినిమా నచ్చలేదంటే.. దాన్ని పరిగణలోకి తీసుకుంటున్నారు. కొంచెం అయినా కామన్‌సెన్స్ ఉందా? మీకు? యూట్యూబ్‌లో కామన్ సెన్స్ లేకుండా పిచ్చి పిచ్చి హెడ్డింగ్‌లు పెట్టి చెత్త రివ్యూలు రాస్తున్నారు. కొంచెమైనా పాజిటివ్ ఉండటం లేదు. మనకు వినోదాన్ని పంచడం కోసం వాళ్లు కోట్లు ఖర్చుపెట్టి రెండేళ్లు శ్రమపడి సినిమా తీస్తే.. వాళ్లపై నెగిటివ్‌గా చెప్తున్నావ్.. నువ్ పాజిటివ్‌గా మాట్లాడకపోయినా పర్లేదు. నెగిటివ్ మాత్రం వద్దు. ఎప్పటి నుండో దీనిపై మాట్లాడదాం అనుకున్నా.. యూట్యూబ్‌లో లైక్స్ కోసం ఏవోవే రాస్తున్నారు. ఇది చాలా తప్పు. ఇతడు బాలేదని చెప్పడం వల్ల చాలామంది థియేటర్స్‌కు వెళ్లడం లేదు. నేను మంచి సినిమా అభిమానిని. ఒక తెలుగు వాడిగా గర్వంగా ఫీల్ అవుతా. తెలుగోడు స్టామినా.. నేషనల్ నుండి ఇంటర్నేషనల్ స్థాయికి పెరగడం గర్వంగా ఫీల్ అవుతున్నా. ఇప్పుడు నా మాటల్ని కూడా తప్పు పట్టే వాళ్లు చాలా మంది ఉన్నారు. తప్పుపట్టుకోండి నాకు నష్టం లేదు. మనస్పూర్తిగా చెబుతున్నా.. ‘సాహో’ సినిమా చాలా బాగుంది. నాకు నచ్చింది. మీరు కూడా చూడండి. సినిమాను బతికిద్దాం.. చూసి బతికిద్దాం. సినిమా నచ్చకపోతే.. మీకు పోయేవి రూ. 200 మాత్రమే.. వాటికోసం దయచేసి సినిమా చూసే వాళ్లను చెడగొట్టకండి. సినిమా తీయడం అంటే అంత ఈజీ కాదు’ అంటూ ‘సాహో’ నెగిటివ్ రివ్యూస్‌పై ఫైర్ అయ్యారు రవి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/32lu6mj

No comments:

Post a Comment

'I Wanted Waheeda Rehman For Ankur'

'I don't think Waheeda had the confidence that I could pull it off, so she said no.' from rediff Top Interviews https://ift.tt...