Friday 30 August 2019

సమంత లాస్ట్ సినిమా ఇదేనా

తన చేతిలో ఉన్న ప్రాజెక్ట్‌లన్నీ పూర్తి చేసుకుని పిల్లల కోసం రెండేళ్ల పాటు విరామం తీసుకోవాలనుకుంటున్నారట అగ్ర కథానాయిక . ప్రస్తుతం తన కుటుంబంతో కలిస స్పెయిన్‌లో విహరిస్తున్న సమంత.. తిరిగి భారత్ వచ్చాక ‘96’ రీమేక్‌లో నటిస్తారు. ఈ సినిమా తర్వాత ఆమె ప్రముఖ నటుడు సోనూ సూద్ తెరకెక్కిస్తున్న పీవీ సింధు బయోపిక్‌లో బ్యాడ్మింటన్ ఛాంపియన్ పాత్రలో నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదే నిజమైతే ఈ సినిమా తర్వాత పిల్లల కోసం సమంత తన కెరీర్‌కు టెంపరరీగా ఫుల్‌స్టాప్ పెడతారట. అదీకాకుండా నాగార్జున, నాగచైతన్య, సమంత కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ వదంతులన్నింటికీ సమాధానం కావాలంటే సమంత హైదరాబాద్‌కు వచ్చే వరకు ఎదురుచూడాల్సిందే. తమిళంలో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న ‘96’ సినిమాను తెలుగులో దిల్ రాజు రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రంలో సమంతకు జోడీగా శర్వానంద్ నటిస్తున్నారు. ప్రేమ్ కుమార్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Ul6GdH

No comments:

Post a Comment

'Don't Involve My Family!'

'My weakness is my family, and the people I love.' from rediff Top Interviews https://ift.tt/2lOucDz