‘డై హార్డ్ ఫ్యాన్స్’ రచ్చ చేయడానికి సమయం ఆసన్నమైంది. ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘సాహో’ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో పైరసీ బాబులకు శ్రద్ధా వార్నింగ్ ఇచ్చారు. ‘వరల్డ్ సాహో డే వచ్చేసింది. చెమట, రక్తం ధారపోసి ఈ భారీ చిత్రాన్ని ఎంతో నిబద్ధతతో చిత్రీకరించాం. ఇదంతా కేవలం రెప్పపాటు సమయంలో జరిగిపోలేదు. మీ ప్రేమాభిమానాలతో ఎన్నో అవాంతరాలను ఛేదించి పూర్తిచేయగలిగాం. ఇప్పుడు ‘సాహో’ సినిమా డై హార్డ్ ఫ్యాన్స్‌ది. స్పాయిలర్స్‌ని స్ప్రెడ్ చేయకండి. సాహో సినిమాను మీ దగ్గర్లోని థియేటర్లలోనే చూడండి. పైరసీకి నో చెప్పండి. ఒకవేళ ఎవరైనాసినిమా పైరసీ చేసినట్లు తెలిస్తే వెంటనే నేను ఇచ్చిన పైరసీ ఆర్గనైజేషన్‌కు సమాచారం అందించండి’ అని పేర్కొన్నారు. 2019లో విడుదలైన దాదాపు అన్ని బాలీవుడ్ చిత్రాలు పైరసీ బారిన పడినవే. సాహో సినిమాకు అలాంటి సమస్యలు ఎదురుకాకూడదని చిత్రబృందం అన్ని చర్యలను తీసుకుంది. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దాదాపు రూ.350 కోట్లు ఖర్చు పెట్టి తెరకెక్కించారు. ఇందులో నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, జాకీ ష్రాఫ్, మహేశ్ మంజ్రేకర్, చుంకీ పాండే తదితరులు కీలక పాత్రలు పోషించారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2ZBtAPk
No comments:
Post a Comment