Saturday 31 August 2019

Disha patani: మా అన్నయ్య దిశాను ప్రేమించలేదు

టైగర్ ష్రాఫ్, .. ముంబయిలోని ఏ రెస్టారెంట్‌లో చూసినా ఈ జంట ఎక్కువగా కనిపిస్తోంది. దాంతో వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని ఎన్నో వార్తలు పుట్టుకొచ్చాయి. మీడియా వర్గాలు ప్రశ్నిస్తే.. అయ్యో మా ఇద్దరి మధ్య అలాంటిదేమీ లేదు అంటారు. కానీ కలిసి తిరగడం మాత్రం మానరు. ఈ నేపథ్యంలో టైగర్ సోదరి కృష్ణా ష్రాఫ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన సోదరుడి గురించి వస్తున్న వార్తలపై స్పందించారు. ‘నేను అస్సలు అబద్ధాలు చెప్పను. ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతాను. మా అన్నయ్య 100 పర్సెంట్ సింగిల్‌గానే ఉన్నాడు. ఒకవేళ నాకు అవకాశం ఉంటే.. దిశా పటానీని ఆదిత్య రాయ్ కపూర్‌తో జత చేయిస్తాను’ అని తెలిపారు. గతంలో టైగర్‌ను ఓ అభిమాని ప్రశ్నిస్తూ… ‘మీరు దిశా పటానీతో డేటింగ్‌లో ఉన్నారా?’ అని అడిగారు. ఇందుకు టైగర్ సమాధానమిస్తూ.. ‘నాకు అంత సీన్ లేదు’ అన్నారు. కొన్ని రోజుల తర్వాత ఈ ప్రశ్న దిశా పటానీకి ఎదురైంది. ‘మీరు టైగర్ ప్రేమలో ఉన్నారన్న విషయాన్న ఒప్పుకోవచ్చు కదా.. మీ జంట చూడటానికి బాగుంటుంది’ అని ఓ అభిమాని దిశాకు సలహా ఇచ్చాడు. ఇందుకు దిశా ఆన్సర్ ఇస్తూ.. ‘నేను చాలా కాలంగా టైగర్‌ను మనసు దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. తనని ఇంప్రెస్ చేయడానికి బ్యాక్ ఫ్లిప్ చేయడం నేర్చుకున్నాను. మేమిద్దరం కలిసి తినడానికి వెళ్తుంటాం. కానీ దాని అర్థం మేమిద్దరం ప్రేమలో ఉన్నామని కాదు. మీరు ఈ ప్రశ్న టైగర్‌నే అడగండి’ అని సెలవిచ్చారు. దిశా, టైగర్ గురించి ఆయన తండ్రి జాకీ ష్రాఫ్ కూడా స్పందించారు. ‘టైగర్, దిశాకు ఒకే ప్యాషన్ ఉంది. ఇద్దరికీ డ్యాన్స్ అంటే ఇష్టం. వర్కవుట్స్ చేయడం అంటే ఇష్టం. దిశా ఆర్మీ అధికారుల కుటుంబానికి చెందిన అమ్మాయి. కాబట్టి డిసిప్లైన్డ్‌గా ఉంటుంది. వారు భవిష్యత్తులో పెళ్లి చేసుకుంటారా? లేక స్నేహితులుగానే మిగిలిపోతారా? అని ఎవ్వరూ ఊహించలేరు’ అని తెలిపారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2MO5BKL

No comments:

Post a Comment

'Don't Involve My Family!'

'My weakness is my family, and the people I love.' from rediff Top Interviews https://ift.tt/2lOucDz