Saturday, 31 August 2019

Namratha: సమంత.. మహేశ్‌తో నా ఫొటో చూశావా..

సినీ ప్రముఖులు సోషల్‌మీడియాలో పోస్ట్ చేసే ఫొటోలకు అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అందులోనూ మహేశ్ బాబు, సమంత, ఎన్టీఆర్ లాంటి స్టార్ సెలబ్రిటీలకు ఉండే క్రేజ్ గురించైతే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా సమంత తన భర్త నాగచైతన్యను ఆలింగనం చేసుకున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఫొటోకు ‘మై చై అక్కినేని’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ ఫొటో చూసిన నమ్రత వెంటనే తన ఇన్‌స్టాగ్రామ్‌లో మహేశ్‌ను ఆలింగనం చేసుకున్న ఫొటోను పోస్ట్ చేశారు. దీనికి సమంత పేరుని ట్యాగ్ చేస్తూ.. ‘సేమ్ సేమ్’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఇందుకు సమంత బదులిస్తూ.. ‘మీ ఇద్దరూ బెస్ట్ కపుల్’ అని కాంప్లిమెంట్ ఇచ్చారు. సమంత, మహేశ్ కలిసి ‘దూకుడు’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సామ్.. తన కుటుంబంతో కలిసి స్పెయిన్‌లోని ఐబిజాలో విహారయాత్రను ఎంజాయ్ చేస్తున్నారు. మరోపక్క సూపర్‌‌స్టార్ మహేశ్ బాబు ఫ్యామిలీ కశ్మీర్‌లో ఉన్నారు. మహేశ్ నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా చిత్రీకరణ అక్కడే జరుగుతోంది. ఈరోజు మహేశ్ కుమారుడు గౌతమ్ ఘట్టమనేని 13వ పుట్టినరోజు జరుపుకొంటుడడంతో అక్కడే గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోబోతున్నారట.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2PsG6AG

No comments:

Post a Comment

Pradyut Bordoloi On Why He Quit Congress To Join BJP

'I could have accepted the humiliation if I wanted to remain as an MP. But I decided to leave.' from rediff Top Interviews https:/...