Thursday, 29 August 2019

Prabhas Saaho: ‘సాహో’ హైలైట్స్.. స్టేడియంలో సిక్స్ బాదాడా?

‘సాహో’.. ఫీల్ గుడ్ మూవీకి ముందు వచ్చే స్మోకింగ్ యాడ్ లాంటివాడు. కంటెంట్ కరెక్ట్‌గా ఉన్నా.. విజువల్ చాలా డిస్ట్రబింగ్‌గా ఉంటుంది అంటూ ట్రైలర్‌తో ఆసక్తిరేపి ప్రేక్షకుల్ని థియేటర్స్ వైపుకు తీసుకురాగలిగారు. ‘బాహుబలి’ చిత్రంతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ దేశాలకు పరిచయం చేసి ఇంటర్నేషనల్ స్టార్‌గా మారారు . దీంతో ఆయన చిత్రాలకు భారీ క్రేజ్ ఏర్పడింది. ఈ క్రేజ్‌కు తగ్గట్టే ‘రన్ రజా రన్’ ఫేమ్ సుజీత్ ‘సాహో’ అనే భారీ ప్రాజెక్ట్‌కు మూవీని రూపొందించారు. యూవీ క్రియేషన్స్‌లో సుమారు రూ. 350 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన యాక్షన్ ప్యాక్డ్ మూవీ నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. గురువారం అర్ధరాత్రి నుండి పలుచోట్ల ‘సాహో’ మూవీ ప్రదర్శితం కావడంతో సోషల్ మీడియాలో ‘సాహో’ మేనియా నడుస్తోంది. Read Also: ‘సాహో’ మూవీ హైలైట్స్.. ✦ అండర్‌ కవర్‌ కాప్‌గా అశోక్‌ చక్రవర్తి పాత్రలో ప్రభాస్‌ ✦ క్రైమ్‌ బ్రాంచ్‌కు చెందిన అమృతా నాయర్‌ పాత్రలో శ్రద్ధ కపూర్‌ ✦ గ్యాంగ్‌స్టర్స్ నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్ కథను అల్లిన దర్శకుడు సుజీత్. ✦ హాలీవుడ్ స్థాయిలో యాక్షన్ సన్నివేశాలు. ✦ ఛేజింగ్స్ సీన్స్, చివరి ఇరవై నిమిషాల యాక్షన్ పార్ట్ హైలైట్ ✦ ప్రభాస్ వన్ మ్యాన్ షో.. డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో ప్రభాస్. ✦ క్లైమాక్స్ ట్విస్ట్ సస్పెన్స్ థ్రిల్లింగ్ ✦ జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్‌ ‘బ్యాడ్‌ బాయ్‌...’ సాంగ్ అదనపు ఆకర్షణ ✦ ప్రభాస్ రియల్ క్యారెక్టర్ బయటపడే ఇంటర్వెల్ సీన్ మైండ్ బ్లోయింగ్ ✦ క్లైమాక్స్‌లో హైవోల్టేజ్ యాక్షన్ సీన్స్ ✦ కుదిరిన ప్రభాస్, శ్రద్ధా జోడీ.. లవ్ ట్రాక్ ఇంట్రస్టింగ్ ✦ వినోదానికి దూరంగా ‘సాహో’.. కామెడీ లేకపోవడం మైనస్ ✦ గ్రిప్పింగ్ తప్పిన స్క్రీన్ ప్లే.. ✦ ఆకట్టుకోలేకపోయిన సాంగ్స్


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2zy6deE

No comments:

Post a Comment

'Investments Of Over Rs 4 Trn To Create 100,000 Jobs'

'The size of the investments is important, but equally crucial is the number of jobs that these proposals create.' from rediff Top...