Monday, 26 August 2019

Disco Raja: ‘డిస్కోరాజా’.. సింధూరం లుక్ ఫేక్.. మరి అతడెవరు?

ప్రస్తుతం మాస్ రాజా ‘డిస్కోరాజా’ చిత్రంలో నటిస్తున్నారు. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ డైరెక్టర్ వీఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉండగా.. ఈ చిత్రానికి సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కొత్త లుక్‌లో రవితేజ.. సింధూరం నాటి రవితేజను గుర్తుచేస్తూ యంగ్ లుక్‌లో దర్శనం ఇచ్చాడు. అయితే ఇది ఫేక్ ఫొటో అంటూ క్లారిటీ ఇచ్చారు దర్శకుడు వీఐ ఆనంద్. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రవితేజ లుక్ నిజం కాదని , అసలు లుక్ ని త్వరలోనే విడుదల చేస్తామని వివరణ ఇచ్చారు దర్శకుడు. Read Also: మొత్తానికి ‘డిస్కోరాజా’ ఫేక్ ఫొటోతో రవితేజ న్యూ లుక్ సోషల్ మీడియా వైరల్ అయ్యింది. ఒకరకంగా అఫీషియల్ ఫస్ట్ లుక్ కంటే ఈ ఫేక్ లుక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. యాక్షన్ రివేంజ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రవితేజకు జోడీగా పాయల్‌ రాజ్‌పుత్‌, నభా నటేష్‌‌లు నటిస్తున్నారు. తమన్‌ స్వరాలను సమకూర్చుతుండగా.. రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2KXEfjf

No comments:

Post a Comment

'I Wanted Waheeda Rehman For Ankur'

'I don't think Waheeda had the confidence that I could pull it off, so she said no.' from rediff Top Interviews https://ift.tt...