Tuesday 27 August 2019

యోగిబాబుకు నిత్యానంద నోటీసులు

యోగిబాబు మంచి కమెడియన్‌గా తమిళ చిత్ర పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన హాస్యనటుడిగా నటించిన చిత్రం ‘పప్పీ’. ఈ సినిమాలో యోగిబాబు వివాదాస్పద బాబా స్వామి పాత్రను పోషించారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ విడుదలైంది. పోస్టర్‌లో యోగిబాబు నిత్యానంద పాత్రను పోషించారు. తన వద్దకు వచ్చే భక్తులను నమ్మించి మోసం చేస్తున్నట్లుగా ఆ పాత్ర ఉందని నిత్యానంద భావించారు. దాంతో యోగిబాబుతో పాటు ‘పప్పీ’ చిత్రందానికి నోటీసులు పంపారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఆ పాత్ర ఉందంటూ ఇప్పటికే ఓ హిందూ సంఘం చిత్ర బృందంపై కేసు వేసినట్లు కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. దీనిపై దర్శకుడు నత్తు స్పందిస్తూ.. తాము ఎవరి మనోభావాలను దెబ్బతీయలేదని, సినిమాలో యోగిబాబు నిత్యానందను ఆరాధించే వ్యక్తిగా కనిపించనున్నారని తెలిపారు. వేల్స్ ఫిలిం ఇంటర్నేషసల్ ఈ సినిమాను నిర్మిస్తోంది. నత్తూ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2MFqV4U

No comments:

Post a Comment

'Don't Involve My Family!'

'My weakness is my family, and the people I love.' from rediff Top Interviews https://ift.tt/2lOucDz