Tuesday, 2 July 2019

Raju Gari Gadhi 3: ‘రాజుగారి గది’లో తాప్సీ.. బయటకు తమన్నా!

ఓంకార్ అన్నయ్యా.. అంటూ బుల్లితెరపై సందడి చేసి మెగా ఫోన్ పట్టి ‘రాజుగారి గది’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన యాంకర్ కమ్ డైరెక్టర్ ఓంకార్.. ఈ చిత్రానికి సీక్వెల్స్ తీసుకుంటూ పోతున్నారు. ఇప్పటికే ‘రాజుగారి గది’, ‘రాజుగారి గది 2’ చిత్రాలను రూపొందించిన ఓంకార్.. ఇటీవల ‘రాజుగారి గది 3’ చిత్రానికి కొబ్బరికాయ కొట్టేశారు. ఓంకార్ స్వీయ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు హీరోగా నటిస్తుండగా.. లీడ్ రోల్‌లో నటిస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్ పనులు జరుగుతుండగా.. ఈ ప్రాజెక్ట్ నుండి తమన్నా తప్పుకున్నట్టు తెలుస్తోంది. సినిమాకి ముందు స్క్రిప్ట్ మొత్తం చూసుకునే తమన్నా.. ఈ సినిమా స్క్రిప్ట్ పరంగా దర్శకుడితో డిఫరెన్సెస్ రావడంతో ఈ ప్రాజెక్ట్‌నుండి తప్పుకున్నట్టు తెలుస్తోంది. దీంతో పాటు బాలీవుడ్ మోజు పెంచుకున్న మిల్కీ బ్యూటీకి ‘బోలే చుడియా’ అనే బాలీవుడ్‌కి సైన్ చేయడంతో రెండు చిత్రాలకు డేట్స్ కుదరకపోవడం వల్ల ‘రాజు గారి గది’ నుండి బయటకు వచ్చేందుకు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అయితే తమన్నా ప్లేస్‌ని తాప్సీతో రీప్లేస్ చేసే ఆలోచనలో ఉందట చిత్ర యూనిట్. ఇటీవల వరుసగా హారర్ చిత్రాలతో సత్తా చాటుతున్న అయితే ‘రాజుగారి గది’లో పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుందని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ‘రాజు గారి గది’లో హ్యాపీగా గృహప్రవేశం తమన్నా ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడం.. తాప్సీ సాఫీగా ‘రాజు గారి గది’లో పాలు పొంగించేందుకు రెడీ కావడం తదితర విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సిఉంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2XjaMTR

No comments:

Post a Comment

'India Playing A Chess Game In Nepal'

'Nepal today is far more aware, self-confident, aspirational, and assertive.' from rediff Top Interviews https://ift.tt/LrOfiUE