Tuesday, 2 July 2019

నువ్వు చాలా హాట్.. నీ బెల్లీపై ఆమ్లెట్ వేస్తా అన్నాడు: మల్లికా శెరావత్

బాలీవుడ్ హాట్ భామ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ప్రస్తుతం ఆమెకు సినిమాలు తక్కువయ్యాయి కానీ, ఒకప్పుడు వెండితెరను తన అందచందాలతో కప్పేసింది. బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్ సినిమాలు కూడా చేసింది. జాకీచాన్ లాంటి ఇంటర్నేషనల్ యాక్టర్‌తో నటించింది. ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం ‘బూ - సబ్‌కి ఫతేగి’ అనే హారర్ కామెడీ సినిమాలో తుషార్ కపూర్‌కు జంటగా నటిస్తోంది. ఇదిలా ఉంటే, తాజాగా ఓ బాలీవుడ్ నిర్మాతపై మల్లికా శెరావత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. హిందీలో బాగా పాపులర్ అయిన ‘ది కపిల్ శర్మ షో’లో మల్లికా శెరావత్ పాల్గొన్నారు. ఈ షోలో కపిల్ శర్మతో మాట్లాడుతూ ఒక నిర్మాత తనతో ప్రవర్తించిన తీరును వెల్లడించారు. తను ఎంత హాట్‌గా ఉంటుందో ప్రేక్షకులకు చెప్పడానికి తన బెల్లీపై ఆమ్లెట్ వేయడానికి ఆ నిర్మాత ప్రయత్నించాడని మల్లిక తెలిపారు. అంతేకాకుండా, ఫిల్మ్ ఇండస్ట్రీలోని పలు రూమర్ల గురించి కూడా ఆమెను కపిల్ శర్మ ప్రశ్నించారు. వీటికి మల్లికా సైతం ఆసక్తికర సమాధానాలు చెప్పారు. దీనిలో భాగంగానే ఈ హాట్ ఆమ్లెట్ గురించి వెల్లడించారు. ‘‘ఒకరోజు ఓ సినిమా పాట షూటింగ్‌లో నేను పాల్గొన్నాను. ఆ నిర్మాత ఇండస్ట్రీకి కొత్త. దీంతో ‘మల్లికా చాలా హాట్’ అనే విషయాన్ని ప్రేక్షకులకు ఎలా చెప్పాలి అనే విషయంపై ఒక ఆలోచనకు వచ్చాడు. కొరియోగ్రాఫర్ ద్వారా ఆ ఐడియాను నా దగ్గరకి తీసుకొచ్చాడు. ‘పాటలో భాగంగా మీ బెల్లీపై ఎగ్ ఫ్రై చేయొచ్చా?’ అని అడిగించాడు. ఇది నిజం! ఆ నిర్మాత ఇలానే అడిగాడు’’ అని మల్లికా చెప్పారు. మరి దీనికి మీరు అంగీకరించారా? అని కో-హోస్ట్ అర్చన పురాన్ సింగ్ అడగగా.. ‘లేదు.. నా వల్ల కాదన్నాను’ అని మల్లికా శెరావత్ సమాధానం ఇచ్చారు. షూటింగ్‌లో భాగంగా జరిగిన ఇలాంటి మరో సంఘటనను ఇటీవల ఓ సందర్భంలో మల్లికా శెరావత్ చెప్పారు. ఒక డైరెక్టర్ తనతో డిఫరెంట్‌గా ఏదో చేయడానికి ప్రయత్నించాడని, తన నడుముపై వేడి వేడి రోటీ వండుతానని చెప్పాడని మల్లికా వెల్లడించారు. మొత్తం మీద వీళ్లంతా మల్లికా శెరావత్ ఎంత హాటో ప్రేక్షకులకు చెప్పడానికి ప్రయత్నించారన్న మాట. కానీ, అలా చేసిన తరవాత ప్రేక్షకులు ఎలాంటి కామెంట్లు చేస్తారో ఊహించలేనట్టుంది. మొత్తానికి వీటిని తిరస్కరించి మల్లికా మంచి పనే చేసింది. లేకపోతే ఈమెను కూడా విపరీతంగా ట్రోల్ చేసేవారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2KVwX0B

No comments:

Post a Comment

'India Playing A Chess Game In Nepal'

'Nepal today is far more aware, self-confident, aspirational, and assertive.' from rediff Top Interviews https://ift.tt/LrOfiUE