Sunday 14 July 2019

నగ్నంగా నటించడానికి ‘ఆమె’కు బుద్ధిలేదా?: తమ్మారెడ్డి

మంచి సినిమాలు తీసే దర్శకులు.. అద్భుతంగా పెర్ఫామ్ చేసే నటులు ఉన్నంతకాలం మంచి సినిమాలు వస్తూనే ఉంటాయన్నారు దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. అమలాపాల్‌ లీడ్‌ రోల్‌లో రత్నకుమార్‌ దర్శకత్వం వహించిన తమిళ చిత్రం‘ఆడై’. ఈ చిత్రాన్ని దర్శక నిర్మాత ‘ఆమె’ పేరుతో ఈ నెల 19న తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో అమలాపాల్‌పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు తమ్మారెడ్డి. ఆయన మాట్లాడుతూ.. 40 ఇయర్స్ ఇండస్ట్రీ.. నేను 1947లో ఇండస్ట్రీకి వచ్చా.. ఇప్పటికి 40 ఏళ్లైంది. శ్రీకాంత్ పాతికేళ్ల క్రితం ‘ఆమె’ చిత్రం చేశారన్నారు. ఈలోపు అమాలాపాల్ నటించిన ‘ఆమె’ చిత్ర దర్శకుడు వచ్చి.. ఈ చిత్రంలో 70 ఏళ్ల క్రితం సుశీల గారు పాడిన పాటని ఇందులో రికార్డ్ చేశాం. ఆవిడ 15 ఏళ్ల నుండి పాటలు పాడటం లేదు.. ఇప్పుడు ఆవిడతో పాట పాడించాం అన్నారు. ఈ చిత్రం సందర్భంగా ఇటువంటి పాత జ్ఞాపకాలు చాలానే ఉన్నాయి. నా కెరియర్ స్టారింగ్ చిరంజీవిగారితో ప్రారంభమైంది. చిరంజీవి, నేను ఒకే చిత్రంతో కెరియర్ స్టార్ట్ చేశాం. ‘ఆమె’ చిత్రం నాకు బిగ్ షాక్.. ఆ తరువాత సుమన్, భాను చందర్, శ్రీకాంత్, విద్యాసాగర్, మిక్కీ జె మేయర్ లాంటి వాళ్లు అందరూ ఇక్కడ నుండే వచ్చారు. పెద్ద పెద్ద హీరోలతో అంతపురం లాంటి పెద్ద పెద్ద హిట్‌లు ఇచ్చాము. అయితే ఈ 40 ఏళ్లలో నాకు తగలని షాక్.. ఈ ‘ఆమె’ చిత్రం. అతడు బుద్ధిలేక కథ రాస్తే.. ఇమె బుద్ధిలేకుండా బట్టల్లేకుండా నటిస్తుందా? ‘ఆమె’ సినిమా నేను పోస్టర్ చూడగానే కమర్షియల్‌గా పనికి వస్తుందని కొన్నా. సినిమా చూస్తారులే అని కొన్నా. కాని వెళ్లి సినిమా చూసిన తరువాత నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఈ పిల్లోడు రత్న కుమార్ ఈ కథ ఎలా రాశాడు. ఎందుకు రాశాడు. అతనికి బుద్ధి ఉండి రాశాడా? లేక బుద్ధిలేక రాశాడా? సరే అతనికి బుద్దిలేదనుకుందాం.. ఈ పిల్ల ()కి ఎందుకు బుద్ధి లేదు. ఈ పిల్లకు బుద్ది ఉండాలి కదా.. అతను బట్టల్లేకుండా ఉండాలని కథ రాస్తే.. ఈ పిల్ల చేస్తానంటుందా? ఈ ఇద్దరూ అనుకుంటే ప్రొడ్యుసర్ ఇంకా పిచ్చోడు. ఈ సినిమా నేను కొన్నా కాబట్టి అంతకంటే పెద్ద పిచ్చోడిని అది వేరే విషయం (నవ్వుతూ). నన్న నమ్మి చాలామంది ప్రొడ్యుసర్‌లు వచ్చారు. చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్ వచ్చారు. వంద మంది మధ్య నగ్నంగా అమలాపాల్.. ధైర్యంకావాలి ఇదంతా చేయడానికి సినిమా పట్ల ప్రేమ ఉండాలి. సినిమాని విపరీతంగా ప్రేమించాలి. ఇలాంటి కథ చేయాలంటే గట్స్ కావాలి. బట్టల్లేకుండా షూటింగ్ చేయడం అంటే చిన్న విషయం కాదు.. లొకేషన్‌లో వంద మంది ఉంటారు. దాన్ని పక్కన పెడితే ముందు బట్టల్లేకుండా నటించడానికి ధైర్యం కావాలి. ఓ దర్శకుడు పొరపాటున ఇలాంటి కథ చెబితే.. ఏంటండీ బట్టల్లేకుండా సినిమా చేయమంటారా? అని అడిగే రోజుల్లో.. కథను నమ్మి చేసిన అమలాపాల్‌ని అభినందించాల్సిందే. ఇలాంటి అద్భుతమైన నటిని నా కెరియర్‌లో చూడలేదు.. నేను ఈ సినిమా చూశాను. ఈ జనరేషన్‌లో ఇంతలా పెర్ఫామెన్స్ చేసే నటిని నేను చూడలేదు. ఈ సినిమాను ఈ సినిమాను తీసుకోవడానికి గర్వపడుతున్నాను.. ఎందుకంటే ఇండస్ట్రీలో నాకొక ఇమేజ్ ఉంది. ఆడవాళ్లకు సంబంధించి మంచి సినిమాలు తీస్తాడు.. ఆడినా ఆడకపోయినా మెసేజ్ ఉన్న చిత్రాలను తీస్తాడనే పేరు ఉంది. ఈ సినిమా ఇది పిచ్చో మంచో నాకు తెలియదు కాని.. నా జీవితంలో మంచి సినిమా అవుతుందనే నమ్మకం ఉంది. ఇది గొప్ప అనుభూతి. మంచి సినిమాలు తీసే దర్శకులు.. అద్భుతంగా పెర్ఫామ్ చేసే నటులు ఉన్నంతకాలం ఇలాంటి మంచి సినిమాలు వస్తూనే ఉంటాయన్నారు తమ్మారెడ్డి భరద్వాజ.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2LmxbOv

No comments:

Post a Comment

'I Don't Do Intimate Scenes'

'There are some things I may not be comfortable about. Explicit things and all that.' from rediff Top Interviews https://ift.tt/ge...