Sunday 14 July 2019

బాలకృష్ణ మాజీ పీఏకు మూడేళ్ల జైలు.. కారణం ఇదే!

ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే మాజీ పర్సనల్ అసిస్టెంట్ శేఖర్ నాయుడుకు మూడేళ్ల జైలు శిక్ష, మూడు లక్షల రూపాయల జరిమానా విధిస్తూ నెల్లూరు ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించింది. ‘పైసా వసూల్ నాయుడు’గా పేరొందిన శేఖర్‌ను లెక్కకు మించిన ఆస్తుల కేసులో కోర్టు దోషిగా తేల్చింది. సుమారు పదేళ్ల క్రితం నమోదైన ఈ కేసుకు సంబంధించి మూడు రోజుల క్రితం ఏసీబీ కోర్టు తుది తీర్పు వెల్లడించింది. తిరుపతి పద్మావతి యూనివర్సిటీలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా పనిచేస్తోన్న శేఖర్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బాలకృష్ణ ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు డిప్యుటేషన్ మీద ఆయనకు పీఏగా వచ్చారు. ఆ సమయంలో బాలకృష్ణ పేరుతో హిందూపురంలో శేఖర్ అక్రమ వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. హిందూపురం వాసులు ప్రభుత్వ పథకాలు పొందాలంటే శేఖర్‌కు ముడుపులు చెల్లుంచుకోవాల్సిందే. అంతేకాకుండా, శేఖర్ కారణంగా స్థానిక టీడీపీ నాయకుల్లో సైతం మనస్పర్థలు వచ్చాయి. ఈ విషయాలు బాలకృష్ణ, టీడీపీ దృష్టికి రావడంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో శేఖర్‌కు ఉద్వాసన పలికారు. కాగా, శేఖర్ నాయుడుపై 2008లో కేసు నమోదైంది. ఇక బాలకృష్ణ సినిమాల విషయానికి వస్తే.. ఎన్టీఆర్ బయోపిక్ సిరీస్‌లో చివరిగా కనిపించిన ఈ నందమూరి హీరో ఇప్పుడు కె.ఎస్.రవికుమార్‌తో కొత్త సినిమాను మొదలుపెట్టారు. వీరిద్దరూ కలిసి గతంలో ‘జైసింహా’ సినిమాకు పనిచేశారు. ఇప్పుడు రెండోసారి జతకట్టారు. సి.కళ్యాణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రారంభమైంది. రెగ్యులర్ షూటింగ్, నటీనటులు, సాంకేతిక నిపుణులు తదితర విషయాలు వెల్లడించాల్సిఉంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/32qOOSr

No comments:

Post a Comment

'India is an important education market'

'It's the second-largest market for us after the US, and should be the largest market at some point.' from rediff Top Intervie...