Sunday 7 July 2019

స్టేజ్‌పైనే ఏడ్చేసిన విజయ్ దేవరకొండ.. తమ్ముడు నాకు హెల్ప్ చేశాడు కాని.. నేను!

అంటే.. అతనో రౌడీ హీరో. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లు, ఆడియో ఫంక్షన్‌లు, వివిధ సినిమా ఫంక్షన్లలలో తన ఫ్యాన్స్‌లో ఉత్సాహం ఇస్తూ తాను అనుకున్నది కుండబద్దలు కొట్టినట్టు చెప్పేస్తాడు. అయితే తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ ‘దొరసాని’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రౌడీ హీరో సెన్సిటివ్‌గా మారిపోయారు. తమ్ముడ్ని తలచుకుని స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకుని తనలోని కొత్త కోణాన్ని చూపించారు. శివాత్మిక రాజశేఖర్, ఆనంద్ దేవకొండ హీరో హీరోయిన్లుగా నటించిన ‘దొరసాని’ మూవీ జూలై 12న విడుదల కానుండటంతో హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరుకాగా.. జీవిత, రాజశేఖర్ తదితరులు విచ్చేశారు. ఈ సందర్భంగా తన తమ్ముడు ఆనంద్ దేవరకొండను ఉద్దేశించి మాట్లాడుతూ కన్నీటి పర్యంతం అయ్యారు విజయ్ దేవరకొండ. ‘దొరసాని’ సినిమా పూర్తి చేసి ప్రమోషన్స్‌కి వచ్చినప్పుడు పూజా కార్యక్రమాలకు రావాలని ఉన్నా ఆపుకున్నా.. టీజర్ షేర్ చేయాలని అనుకున్నా కాని ఆపుకున్నా.. ఈ సినిమాలో నాకు చాలా పాటలు ఇష్టం షేర్ చేద్దాం అనుకున్నా కాని ఆపుకున్నా.. ఎందుకంటే ఇండస్ట్రీలో ఎలా నిలదొక్కుకోవాలో.. తనను తాను ఎలా నిరూపించుకోవాలో తెలుసుకుంటాడని ఈ సినిమాను ఇప్పటి వరకూ పట్టించుకోలేదంటూ స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకున్నారు విజయ్ దేవరకొండ. ఈ సినిమా ప్రీ రిలీజ్‌కు రమ్మని అడిగినప్పుడు.. నాకు సినిమా చూపించమని అడిగా.. నాకు నచ్చకపోతే వేరే వాళ్లను పిలిచే టైం ఉండదు ముందే చూపించండి అన్నాను. మొన్న సినిమా చూశా.. చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. కొత్త పిల్లలు వచ్చి సినిమా తీస్తా అని వచ్చేసి ఏదో సినిమా చేశారులే అనుకున్నా కాని.. సినిమా చూశాక నేను నా ఫస్ట్ సినిమా ఇలా ఎందుకు చేయలేదని అనిపించిందని అన్నారు విజయ్ దేవరకొండ. చాలా సీన్లలో డైలాగ్‌లు లేకుండా నటనతోనే నడిపించాడు దర్శకుడు. చిన్న బడ్జెట్‌లో మంచి చిత్రాన్ని చూపించారు. మ్యూజిక్ అదరగొట్టారు. శివాత్మిక బెస్ట్ యాక్టర్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమాలో పోలీస్ స్టేషన్ సీన్‌లో ఆమె మనసుతో నటించింది. వాళ్ల పెర్ఫామెన్స్ జూలై 12 చూస్తారు. ఆనంద్ గురించి నేను చెప్పను విడుదల రోజు ఆడియన్స్ చెప్తారు. నేను నిన్ను చూసి సర్ ప్రైజ్ అయ్యా’ అంటూ ఎమోషనల్‌గా మాట్లాడారు విజయ్. అంతకు ముందు మట్లాడుతూ.. నా తమ్ముడు ఆనంద్ దేవరకొండ సినిమా చేస్తా.. అన్నప్పటినుండి వాడితో పెద్దగా మాట్లాడలేదు. ఈరోజు వీడితో మాట్లాడాలి. నేను పుట్టపర్తిలో హాస్టల్‌లో ఉండి చదువుకునే వాడిని. నాకు క్లాస్‌లు తొందరగా స్టార్ట్ అయ్యాయి. వీడు ఫస్ట్ క్లాస్ అయినప్పటికీ ఏడ్చుకుంటూ నా క్లాస్ రూం దగ్గరకు వచ్చేసేవాడు. అప్పటి నుండి వీడికి నేను ఎక్కడికి వెళ్తే అక్కడకు వచ్చేయడం వీడికి అలవాటు అయిపోయింది. వీడు యూఎస్ నుండి ఇండియా రావడం నాకు ఇష్టం లేదు. కష్టపడి ఇంజనీరింగ్ చేసి యూఎస్‌లో జాబ్ చేసి ఇండియాకి వచ్చేస్తా అంటే నాకు నచ్చలేదు. ఇప్పుడు ఎందుకురా? ఇండియా వచ్చేసి ఇక్కడ ఏం చేస్తావ్ రా? అని అడిగా? ‘నేను యాక్టింగ్ చేస్తా’ అని అన్నాడు? నేను షాకై.. యాక్టింగ్ అంటే ఆటలు కాదు.. ఎట్లా చేస్తావ్.. సడెన్ వచ్చి నటించేస్తా అంటే అంత ఈజీ కాదు అని చెప్పా. కాని మనోడు ఫిక్స్ అయ్యాడు గట్టిగా. నేను సరే అని.. నీ సినిమా నువ్ చేసుకో. నా దగ్గరకు నువ్ రాకు. నన్ను ఏం అడగకు. నేను ఎలాంటి సపోర్ట్ చేయను అని చెప్పేశా. అప్పటి నుండి ఇప్పటి వరకూ వాడి సినిమా గురించి నేను మాట్లాడలేదు. ఎందుకంటే.. నీళ్లలో పడితే స్విమ్మింగ్ అయినా చేస్తారు.. లేదంటే మునిగిపోతారు. దెబ్బకి తేలిపోతారు. అంటే నేను ఎలాగైతే సినిమాని సెలెక్ట్ చేసుకున్నానో నువ్ చేసుకో.. ఒక కథను ఎంచుకున్న దగ్గర నుండి అది థియేటర్స్‌కి వెళ్లే వరకూ ఎన్ని కష్టాలు ఉన్నాయో నీకు తెలియాలి. అని వాడ్ని అలా వదిలేశా. యూఎస్‌కి వెళ్లి జాబ్ చేస్తూ.. ఇంటికి డబ్బు పంపించి హెల్ప్ చేశావ్. ఆ టైంలో నాకు హెల్ప్ చేశావు కాని నీ సినిమాకి నేం ఏం చేయలేకపోయా అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు విజయ్ దేవరకొండ.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/30lcu8O

No comments:

Post a Comment

'Varun Was Hanging, Upside Down...'

'Varun was so exhilarated with the intense physical action sequences.' from rediff Top Interviews https://ift.tt/KGJTEap