Tuesday 16 July 2019

జగన్ పాదయాత్రకు వెళ్లి తప్పుచేశాం: ‘జబర్దస్త్’ శాంతి స్వరూప్

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్‌సీపీని అధికారంలోకి తీసుకురావడమే ధ్యేయంగా ఆ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే. కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు కొనసాగింది. ఈ పాదయాత్ర ద్వారా రాష్ట్ర ప్రజలను కలిసిన జగన్.. వారి కష్టనష్టాల గురించి తెలుసుకున్నారు. అయితే, జగన్ పాదయాత్రకు కేవలం రాజకీయ రంగానికి చెందినవారే కాకుండా ఇతర రంగాలకు చెందినవారు కూడా తమ మద్ధతును తెలియజేశారు. సినీ పరిశ్రమకు చెందిన చాలా మంది స్వయంగా జగన్‌తో పాటు పాదయాత్రలో పాల్గొన్నారు. ఇక ‘జబర్దస్త్’ కామెడీ షోతో పాపులరైన , వినోద్ కూడా జగన్‌తో నడిచారు. అయితే, జగన్ పాదయాత్రలో పాల్గొనడం కారణంగా శాంతి స్వరూప్, వినో‌ద్‌లను ‘జబర్దస్త్’ నుంచి తొలగించారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ ఆరోపణలపై తాజాగా శాంతి స్వరూప్ స్పందించారు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శాంతి స్వరూప్ మాట్లాడుతూ.. తాము జగన్ పాదయాత్రకు వెళ్లి తప్పుచేశామన్నారు. కానీ, ఆ పాదయాత్రకు వెళ్లడం వల్ల తమను ‘జబర్దస్త్’ నుంచి పక్కన పెట్టలేదని స్పష్టం చేశారు. ‘మేం జగన్ గారి పాదయాత్రకు వెళ్లిన మాట నిజమే. కానీ.. ఆ పాదయాత్రకు, మమ్మల్ని పక్కన పెట్టడానికి సంబంధం లేదు. మేం అపుడు మానేసి వెళ్లాం. మాకు జబర్దస్త్ లైఫ్ ఇచ్చినపుడు మేం దానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అప్పుడు తెలియనితనంతో నేను, వినోద్ వాళ్లు పిలిచారు కదా అని వెళ్లిపోయాం. మేం వెళుతున్న విషయం టీమ్ లీడర్లకు చెప్పాం. కానీ, వారు మేనేజ్ చేయలేకపోయారు. మా పాత్రలు భర్తీ చేయడానికి అక్కడ ఎవ్వరూ లేరు. ఈ విషయంలో డైరెక్షన్ డిపార్టుమెంటుకు మాపై కోపం లేదు. కానీ, ఇంకొకరు ఇలా చేయకూడదు అని మాపై మూడు నెలల నిషేదం విధించారు. మమ్మల్ని నమ్ముకుని స్కిట్లు రాసుకున్నపుడు, ఇలా వదిలేసి వెళ్లడం తప్పు అని మేం తెలుసుకునేలా చేశారు’ అని శాంతి స్వరూప్ చెప్పుకొచ్చారు. ఈ మూడు నెలల కాలంలో తాము డైరెక్షన్ డిపార్ట్‌మెంట్, టీమ్ లీడర్లకు టచ్‌లోనే ఉన్నామని శాంతి స్వరూప్ చెప్పారు. కానీ, బయట మాత్రం తమ గురించి ఏవేవో వార్తలు అల్లేశారని అన్నారు. జగన్ పాదయాత్రలో పాల్గొనడం వల్లే తమను తీసేశారని వచ్చిన ఆరోపణల్లో నిజం లేదన్నారు. కాకపోతే, ‘జబర్దస్త్’ను వదులుకొని జగన్ పాదయాత్రలో పాల్గొనడం తప్పేనని శాంతి స్వరూప్ అంగీకరించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2JC0URa

No comments:

Post a Comment

'Rahul Has To Be More Ruthless'

'I want to ask the Congress only one question: What is more important than election management in politics?' from rediff Top Inter...