Tuesday 16 July 2019

Bigg Boss Telugu: గాయత్రి గుప్తాకు వింత వ్యాధి.. ఆ కారణంగానే బిగ్ బాస్‌‌కి నో ఎంట్రీ

సెక్స్ లేకుండా 100 రోజులు హౌస్‌లో ఉండగలవా? అని నాతో బిగ్ బాస్ కోఆర్డినేటర్స్‌ అసభ్యకరంగా మాట్లాడారంటూ సంచలన ఆరోపణలో మరోసారి ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది నటి గాయత్రి గుప్తా. ఫిదా, ఐస్ క్రీమ్, మిఠాయి, అమర్ అక్బర్ ఆంటోనీ తదితర చిత్రాల్లో నటించి టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్ వివాదంలో తన వాయిస్‌ని గట్టిగా వినిపించింది ఈ నటి. ఈ సందర్భంగా బోల్డ్ కామెంట్స్ బోల్డ్ నటి అనిపించుకుంది. ఒక నిర్మాత తనను రేప్ చేయబోయాడంటూ సంచలన ఆరోపణలు చేసింది. కాగా బిగ్ బాస్ సీజన్ 3లో తనకు ఆఫర్ ఇచ్చి.. అగ్రిమెంట్స్ చేయించుకుని.. రేటు కూడా ఫిక్స్ చేసి రెండు నెలల తరువాత ఇప్పుడు బిగ్ బాస్ షోకి సెలెక్ట్ కాలేదంటూ అన్యాయం చేశారని బిగ్ బాస్ షో నిర్వహకులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది గాయత్రి గుప్తా. ఈ సందర్భంగా తనతో బిగ్ బాస్ కోఆర్డినేటర్స్ అసభ్యకరంగా మాట్లాడారంటూ ఆరోపణలు చేసింది. సెక్స్ లేకుండా 100 రోజులు ఉంటావా? అంటూ అడిగారని బాంబ్ పేల్చింది గాయత్రి గుప్తా. Read Also: ఆమె కామెంట్స్ ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్‌ టాపిక్ కాగా.. ఈ ఇష్యూపై క్లారిటీ ఇస్తూ పలు ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకున్నారు గాయత్రి గుప్తా. అసలు తనకు బిగ్ బాస్ హౌస్‌లో అవకాశం వచ్చింది? ఎందుకు రిజెక్ట్ చేశారన్న దానిపై క్లారిటీ ఇచ్చింది. ఆమె మాట్లాడుతూ.. తొలిత నన్ను బిగ్ బాస్ వాళ్లు అప్రోజ్ అయినప్పుడు ఇంట్రస్ట్ ఉందా? అని అడిగారు. నేను వాస్తవానికి బిగ్ బాస్ ఒక్క ఎపిసోడ్ కూడా చూడలేదు. టీవీ చూడటం అలవాటు లేదు నాకు. కాని హిందీలో ఫస్ట్ సీజన్ ఒక ఎపిసోడ్ చూశా. అంతా నార్మల్‌గానే అనిపించింది. కాని ఆ షోకి ఫుల్ పాపులారిటీ రావడం ఇంట్రస్టింగ్‌గా అనిపించింది. బిగ్ బాస్ వాళ్లు నన్ను అప్రోజ్ అయ్యాక.. జీవితంలో ప్రైవసీ అనేది ఉండదు అనేది వాస్తవంలో అనుభవ పూర్వకంగా తెలుసుకున్నా. నా ఇంట్లో కూడా ఒక కెమెరా ఉందనే ఆలోచనతో ఉంటేనే నేను సేఫ్‌గా బ్రతకగలుగుతాను అని అనుకున్నా. అలా బిగ్ బాస్‌కి కనెక్ట్ అయ్యా. పైగా వాళ్లు ఇస్తానన్న పేమెంట్ కూడా నాకు నచ్చింది. వాస్తవానికి నాకు మనీ చాలా అవసరం అందుకే బిగ్ బాస్‌కి ఓకే చెప్పేశా. అనంతరం బిగ్ బాస్ కోఆర్టినేటర్స్ నన్ను అప్రోజ్ అయ్యారు. మూడో సిట్టింగ్‌లో అభిషేక్, రవి, రఘు అనే ముగ్గురూ మా ఇంటికి వచ్చారు. ముంబై నుండి వచ్చిన అభిషేక్.. ‘100 రోజుల పాటు సెక్స్ లేకుండా ఉండగలుగుతారా? అని అడగడంతో.. ఏం ప్రశ్న అండి.. అంత అవసరం లేదు నాకు. దానికి వర్రీ కాకండి అని చెప్పా. తరువాత మీకు ఏమైనా మీకేమైనా హెల్త్ ప్రాబ్లమ్ ఉందా? అని అడిగారు. Read Also: నాకు ఆటోఇమ్యూనీ డిసీజ్ ఉందని చెప్పా. దాని లక్షణం ఏంటంటే.. చిన్నప్పటి నుండి మనం యాంటిబయోటిక్ ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటాము. బాడీలో ఉండే యాంటిబయోటిక్ కంట్రోల్ చేసేస్తాం. శరీరం చేయాల్సిన పనిని ఈ ట్యాబ్లెట్స్ చేసేస్తుంటే శరీరానికి పనిదొరకక.. కన్ఫ్యూజ్ అయ్యి బాడీ పనిచేయకుండా అయిపోతుంది. ఆ టైంలో బాడీని ఎటాక్ చేస్తుంది. దాంతో పెయిన్స్ వస్తుంటాయి. దీన్నే ఆటోఇమ్యూనీ డిసీజ్ అంటారు. ఇదే నాకు ఉందని చెప్పా. ఈ వ్యాధి వల్ల బరువులు ఎత్తలేనని చెప్పా. నాకు 10 రోజులకు ఒకసారి ఫిజియోథెరఫీ అవసరం పడవచ్చు దానికి నేను మనీ పే చేసుకుంటా అని చెప్పా. దానికి వాళ్లు నీ వల్ల మాకు రేటింగ్స్ వస్తాయి. నో ప్రాబ్లమ్.. మేం ఫిజియోథెరఫీని ఇస్తాము అన్నారు. అగ్రిమెంట్ ప్రకారం జూలై 15 నుండి 100 రోజులు వేరే ప్రాజెక్ట్స్ చేయకూడదన్నారు. దీంతో నేను ఐదారు సినిమాలు వదిలేశా. కాని రెండు నెలల తరువాత ఫోన్ చేసి మీకు ఆటోఇమ్యూనీ డిసీజ్ ఉందని చెప్పారు కదా.. అందువల్ల మిమ్మల్ని సెలెక్ట్ చేయలేదన్నారు. మీరు అగ్రిమెంట్ చేసుకుని నా ఆఫర్స్ అన్నీ వదిలేయమని చెప్పి ఇప్పుడు బిగ్ బాస్‌లో ఛాన్స్ లేదంటే ఎలా అని అడిగా.. వాళ్ల నుండి స్పందన లేకపోవడంతో బిగ్ బాస్‌ నిర్వాహకులపై పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు .


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2JATmy9

No comments:

Post a Comment

'Rahul Has To Be More Ruthless'

'I want to ask the Congress only one question: What is more important than election management in politics?' from rediff Top Inter...