వినోదాన్ని అందించే టీవీ షోలలో ప్రత్యేక స్థానం జబర్దస్త్‌దే. ఆటోపంచులకు ఆర్.ఆర్లు వేసి మరీ.. గాలి తీసేవాళ్లొకరు.. భార్యలను ఆటపట్టిస్తూ పంచుల వర్షం కురిపించేవాళ్లు మరొకరు.. స్కిట్ ఏదైనా కాన్సెప్ట్ కామెడీనే అంటారు అందరూ.! పంచులకు, సెటైర్లకు కామెడీని పండిస్తున్నాయి అన్ని టీమ్స్. మరి ఈ గురువారం నాటి ఖతర్నాక్ కామెడీ షోలో హైలెట్స్ మీ కోసం! షో స్టార్టింగ్‌లో పౌర్ణమి సినిమాలోని 'మువ్వలా నవ్వకిలా ముద్దమందారమా..' సాంగ్‌కి యాంకర్ అనసూయ.. సరికొత్త హొయలొలికించింది. చీరలో సింగారాలుపోతూ వలపుల వయ్యారాలతో మతులు పోగొట్టే ప్రయత్నం చేసింది. యదావిధిగా రోజా, నాగబాబులు జడ్జస్‌గా వ్యవహరించగా.. రాకెట్ రాఘవ స్కిట్‌తో కామెడీ స్టార్ట్ అయ్యింది. ఎప్పటిలానే ఆది.. సెన్సార్ జోకులకు మరి కాస్త మసాలా జోడించగా... చలాకీ చంటీ.. అప్పులిచ్చే వడ్డీవ్యాపారిలా మారి నవ్వులు పుట్టించాడు. ఇక అన్ని స్కిట్లని దాటుకుని అదిరే అభి.. టీం 'పర్ఫామర్ ఆఫ్ ది డే'గా నిలవడమే కాకుండా హ్యాట్రిక్ కొట్టడం విశేషం. ఆ వివరాలేంటో చూద్దాం! రాకెట్ రాఘవ ఓ పెళ్లి సంబంధానికి వెళ్తాడు. అయితే పెళ్లి కూతురు తండ్రి.. రాఘవ క్యారెక్టర్ ఎలాంటిదో తెలుసుకోవడానికి ఓ డిటెక్టివ్‌ని నియమిస్తాడు. ఆ డిటెక్టివ్ శాంతి కుమార్. రాఘవ ఎక్కడుంటే అక్కడికి వెళ్తూ మాట్లాడకుండా కేవలం నవ్వుతాడు శాంతి కుమార్. దాంతో రాఘవకి పిచ్చేక్కుతుంది. ''నన్ను చూసి ఎందుకు నవ్వుతున్నావ్? నేను మీకు ముందే తెలుసా? మనం ఎప్పుడైనా అంతకు ముందు కలిసామా?'' అంటూ అడుగుతాడు కానీ శాంతి కుమార్ నవ్వుతాడు తప్ప సమాధానం చెప్పడు. చివరికి పెళ్లికూతురు తండ్రికి పెళ్లికొడుకు(రాఘవ) చాలా మంచివాడని.. ఎలాంటి చెడు అలవాట్లు లేవని ఫోన్ చేసి చెబుతాడు డిటెక్టివ్ శాంతి కుమార్. దాంతో కూతుర్ని తీసుకుని రాఘవ ఇంటికి వెళ్తాడు పెళ్లికూతురు తండ్రి. అయితే అప్పటికే రాఘవకు పిచ్చెక్కుతుంది. పక్కవాళ్లు ఏం మాట్లాడినా అచ్చు శాంతి కుమార్‌లానే నవ్వుతూ ఉంటాడు మాట్లాడకుండా. ఆ సీన్ బాగా నవ్వు తెప్పిస్తుంది. ఆది స్కిట్ విషయానికి వస్తే.. మొదటంతా భార్యని తిట్టిన ఆది.. ఉన్నట్టుండి పొగుడుతాడు. ''ఏంటో 9.30 అయితే చాలు తెగ పొగిడేస్తారు ఎందుకో..'' అంటుంది భార్య. ''మొగుడు-పెళ్లాల జీవితం కూడా ఈ ఎపిసోడ్లాంటిదేనే.. 9.30 నుంచి పోరాడితే పదకొండింటికి చెక్కులిస్తారు. ఇది కూడా అంతే.. మిమ్మల్ని 9.30 నుంచి పొగిడితే.. పదకొండింటికి మాకు కావాల్సిందిస్తారు'' అంటూ తనదైన శైలిని ప్రయోగించడంతో.. 'షో'లో.. సెన్సార్ నవ్వులు పూసాయి. ఇక అసలు కథలోకి వెళ్తే.. ఆది ఓ డిటెక్టివ్. కరాటీ కళ్యాణి.. రైజింగ్ రాజు భార్య. వీళ్లిద్దరూ ఆది ఇంటి పక్కనే ఉంటారు. రాజు కూడా డిటెక్టివ్వే. ఇద్దరూ కలిసి ఓ హత్య కేసుని పరిశీలించడానికి వెళ్తారు. అయితే అక్కడ హత్య చేసిన కత్తిని ఇద్దరూ పట్టుకుని.. 'హత్య ఎలా జరిగింద'ని ఎంక్వేరీ చేసి.. చివరికి ఆ ఇంటి యజమాని కూతురే ఆ హత్య చేసిందని నిర్ధారిస్తారు. చివరికి ఆ కత్తి మీద వేలు ముద్రలు వీళ్లవే కావడంతో పోలీసులు వచ్చి వీళ్లని అరెస్ట్ చేస్తారు. మధ్య మధ్యలో అల్టిమేట్ పంచ్‌లతో ఆది స్కిట్ బాగా నడిపించాడు. ఇక అదిరే అభి స్కిట్ విషయానికి వస్తే... రావడం రావడమే..''మీకో విషయం చెప్పాలి''.. అంటూ మొదలుపెట్టి.. ..''కెమెరా మెన్స్ అంతా నా దగ్గరికి వచ్చి నన్ను రిక్వస్ట్ చేస్తున్నారు.. మీ స్కిట్స్‌లో కొంచెం కామెడీ తగ్గించండీ.. మేము నవ్వుతుంటే కేమెరా షేక్ అయిపోతుంది అని రిక్వస్ట్ చేస్తున్నారు.. మొన్న మెడికల్ షాప్ వాళ్లంతా వచ్చి సన్మానం చేశారు.. ఎందుకంటే మేము వేసే పంచులకి నవ్వలేక జనాలంతా కడుపు నొప్పితో మెడికల్ షాప్‌కి వెళ్లి టాబ్లెట్స్ కొనుకుంటున్నారట.. అందుకే మెడికల్ షాపులవారి బిజినెస్ పెరిగిపోతుంది'' అంటూ చెప్పుకుంటూ పోతుంటే... ఇంతలో .. ''కడుపు నొప్పికా..? తలనొప్పికా..?'' అని అడగడంతో కామెడీ పండుతుంది. వెంటనే సీరియస్‌గా చూస్తూ.. ''ఏంటీ రివర్స్ పంచ్లేస్తావ్'' అంటూ అనసూయని నిలదీస్తాడు అభి. ''ఉన్నది చెప్పాను అభీ.. అయినా నేను నిజం చెబితే.. నువ్వు ఏం చేస్తావ్.. ఏం చెయ్యగలవ్?'' అంటుంది రివర్స్ అవుతుంది అనసూయ. వెంటనే అభి అనసూయకి ఫ్లైయింగ్ కిస్ ఇచ్చి.. ''అంత మంచి యాంకర్.. ఇంత మంచి పంచులేస్తుంటే.. ముద్దు ఇవ్వడం కంటే.. ఇంక మేమేం చేస్తాం..'' అంటూ అందరినీ నవ్విస్తాడు. ఇక అసలు కథలోకి వెళ్తే.. నవీన్,తేజా, అభి ముగ్గురూ కలిసి లేడీ గెటెప్స్ వేసే.. రాముని చిన్న చూపు చూస్తూ ఉంటారు. ప్రతి చిన్న పనికి రాముని పంపిస్తూ ఇబ్బంది పెడుతుంటారు. అయితే ఓ చోట ఈవెంట్‌కి వెళ్తే వీళ్ల ముగ్గురినీ విడిచి.. రాముని సెలెబ్రెటీలా ట్రీట్ చేస్తారు. మెడలో దండలు లేసి, సెల్ఫీలు దిగుతారు. అయితే అందంతా రాము కల కావడం.. బాగా నవ్వు తెప్పిస్తుంది. మొత్తానికి ఈవారం జబర్దస్త్ ఎపిసోడ్ జబర్దస్త్ కామెడీ నింపింది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2JwfCYX
No comments:
Post a Comment