సినీ ఇండస్ట్రీలో కొందరు హీరోల మధ్య ప్రత్యేకమైన స్నేహబంధం ఉంది. అలాంటి వారిలో ముందువరుసలో ఉంటారు , రామ్ చరణ్. చిన్ననాటి నుంచే బెస్ట్ ఫ్రెండ్స్ అయిన ఈ ఇద్దరూ రెగ్యులర్‌గా కలుసుకుంటూ ఉంటారు. ఒకరి ఇళ్లలో ఒకరు పార్టీలకు అటెండ్ అవుతూ ఎంజాయ్ చేస్తుంటారు. గతంలో చాలా సార్లు శర్వానంద్, కలిసి పలు ఈవెంట్స్‌లో ఎంజాయ్ చేయడం చూశాం. ఈ క్రమంలోనే శర్వానంద్ బర్త్‌డే సందర్భంగా ఆయనకు గ్రాండ్ పార్టీ ఇచ్చారు రామ్ చరణ్. ఈ ఫొటోలను శర్వా తన సోషల్ మీడియాలో ఖాతాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యాయి. 'ఆచార్య' షూటింగ్ నిమిత్తం మారేడుమిల్లి వెళ్లిన రామ్ చరణ్ గత రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. తన చిన్ననాటి స్నేహితుడు శర్వానంద్ పుట్టినరోజు రావడంతో స్పెషల్ పార్టీ అరేంజ్ చేసి శర్వాతో కేట్ చేయించారు రామ్ చరణ్. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన శర్వా.. చెర్రీకి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. గత రాత్రి జరిగిన ఈ పుట్టినరోజు వేడుకలో రామ్ చరణ్, శర్వానంద్ సహా వారి వారి అత్యంత సన్నిహితులు పాల్గొన్నట్లు తెలిసింది. ఇక ఈ హీరోల కెరీర్ విషయానికొస్తే.. మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమా నిర్మాణ బాధ్యతలు చేపడుతూనే అందులో 'సిద్ద' అనే కీలక పాత్ర పోషిస్తున్నారు రామ్ చరణ్. దీంతో పాటు రాజమౌళి రూపొందిస్తున్న RRR సినిమాలో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. మరోవైపు శర్వానంద్ వరుస ప్రాజెక్టులను లైన్‌లో పెట్టారు. ''శ్రీకారం, మహాసముద్రం, ఆడవాళ్లు మీకు జోహార్లు'' సినిమాలతో ఆయన బిజీగా ఉన్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/38fsccb
No comments:
Post a Comment