Wednesday, 24 March 2021

Republic First Look: ప్రభుత్వం ఉందన్న భ్రమలో మనమంతా ఉన్నాం కానీ.. మెగా హీరో స్ట్రాంగ్ మెసేజ్

ఆ మధ్య వరుస ఫ్లాపుల తర్వాత 'చిత్రలహరి' సినిమాతో తిరిగి ట్రాక్ ఎక్కిన మెగా మేనల్లుడు ''ప్రతి రోజూ పండుగే, సోలో బ్రతుకే సో బెటర్'' వంటి సినిమాలతో వరస హిట్స్ అందుకొని సూపర్ ఫామ్ కొనసాగిస్తున్నారు. యూత్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే విభిన్న కథాంశాలను ఎంచుకుంటూ సత్తా చాటుతున్నారు. ఈ క్రమంలోనే 'రిపబ్లిక్' అంటూ మరో డిఫరెంట్ కథతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు సాయి తేజ్. తాజాగా ఈ మూవీ ఫస్ట్‌లుక్ రిలీజ్ చేశారు మెగా పవర్ స్టార్ . ఇప్పటికే 'రిపబ్లిక్' కాన్సెప్ట్ పోస్టర్ వచ్చి తెలుగు ప్రేక్షకుల్లో సినిమా పట్ల క్యూరియాసిటీని పెంచింది. తాజాగా ఈ మూవీ నుంచి సాయి ధరమ్ తేజ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి ఆ క్యూరియాసిటీకి రెక్కలు కట్టారు మేకర్స్. 'ప్రభుత్వం ఉందన్న భ్రమలో మనమంతా జీవిస్తున్నాం.. కానీ మనకు ఇంకా ఆ ప్రభుత్వం ఎలా ఉంటుందో కూడా తెలియదు' అనే స్ట్రాంగ్ మెసేజ్‌తో కూడిన ఈ 'రిపబ్లిక్' ఫస్ట్‌లుక్ పోస్టర్.. సినిమా కథ ఎంత ఆసక్తికరంగా ఉండనుందనే విషయం తెలుపుతోంది. పొలిటికల్ నేపథ్యంలో రొమాంటిక్ అంశాలు జోడించి ఈ సినిమా రూపొందిస్తున్నారు డైరెక్టర్ దేవకట్టా. చిత్రంలో సాయి ధరమ్ తేజ్ సరసన నివేదా పేతురాజ్ హీరోయిన్‌గా నటిస్తోంది. సీఎం పాత్రలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కనిపించనుండటం విశేషం. మెగా మేనల్లుడి కెరీర్‌లో 14వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రానికి భగవాన్, జె.పుల్లారావు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. జేబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, జీ స్టూడియోస్‌ పతాకాలపై భారీ రేంజ్‌లో నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. జూన్‌ 4వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3roUUhs

No comments:

Post a Comment

Will Hathiram Be Killed In Paatal Lok?

'I insisted only Jaideep could play Inspector Haathiram Chaudhary.' from rediff Top Interviews https://ift.tt/RHLTIwD