యాంకర్ అనాలా లేక ప్రముఖ నటి అనసూయ అనాలా అనేది అర్థంకాని పరిస్థితిలో ఉన్నారు జనం. ఈ జబర్దస్త్ భామకు ఆ రేంజ్‌లో అవకాశాలు వస్తున్నాయి మరి. ఇటు బుల్లితెర, అటు వెండితెరపై కొత్త కొత్త ఆఫర్స్ వస్తుండటంతో యమ జోష్‌లో ఉంది అనసూయ. రంగమ్మత్తగా బిగ్ స్క్రీన్‌పై టాలెంట్ బయటపెట్టిన ఈ అమ్మడు.. '' సినిమాలో కూడా నటిస్తోందని విన్నాం. తాజాగా ఈ విషయమై రియాక్ట్ అవుతూ క్లారిటీ ఇచ్చేసింది అనసూయ. స్టైలిష్ స్టార్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' మూవీ రూపొందుతోంది. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ మూవీలో అనసూయ ఓ కీలక పాత్ర పోషిస్తోందని, రంగస్థలం సినిమాలో లాగే ఆమె క్యారెక్టర్‌కి చాలా ఇంపార్టెన్స్ ఉండటంతో పాటు హాట్ డోస్ దట్టించనుందని టాక్ నడిచింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆ ప్రచారాలను ఖండిస్తూ ఓపెన్ అయింది జబర్దస్త్ బ్యూటీ. ఇప్పటి వరకూ 'పుష్ప' సినిమా యూనిట్ నుంచి తనకు ఎలాంటి ప్రతిపాదన రాలేదని చెప్పిన అనసూయ.. ఈ సినిమాలో తాను నటించట్లేదని క్లారిటీ ఇచ్చింది. ఒకవేళ నిజంగానే అలాంటి ఆఫర్ వస్తే మాత్రం తప్పకుండా చేస్తానని ఆమె పేర్కొంది. ఇకపోతే ప్రస్తుతం తనకు ఇతర ఇండస్ట్రీల నుంచి కూడా మంచి అవకాశాలు వస్తున్నాయని చెప్పిన అనసూయ, ఎన్ని అవకాశాలు వచ్చినా బుల్లితెరను మాత్రం వదిలి పెట్టనని చెప్పడం గమనార్హం. బాలీవుడ్ దర్శక నిర్మాతలు కూడా సంప్రదిస్తున్నారని, అయితే తన తొలి ప్రాధాన్యత ఎప్పుడూ టీవీకే ఉంటుందని చెప్పింది అనసూయ. పాత్ర నచ్చితేనే సినిమాలు ఓకే చేస్తానని ఈ సందర్భంగా ఆమె తెలిపింది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3sKW9bO
No comments:
Post a Comment