గత కొన్నేళ్లుగా కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాచో స్టార్ ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టేయాలన్న కసితో మాస్ డైరెక్టర్ సంపత్ నందితో '' మూవీ చేస్తున్నారు. కబడ్డీ గేమ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో గోపీచంద్ సరసన మిల్కీ బ్యూటీ నటిస్తోంది. ఇటు గోపీచంద్, అటు డైరెక్టర్ సంపత్ నంది ఈ మూవీపై స్పెషల్ కేర్ తీసుకుంటున్నారట. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్ సినిమాపై హైప్ పెంచేయగా.. తాజాగా చిత్ర టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు. స్టార్ హీరోయిన్ అక్కినేని సమంత చేతుల మీదుగా 'సీటీమార్' టైటిల్ సాంగ్ రిలీజ్ చేయబడింది. అనంతరం ఈ సాంగ్‌ని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన సమంత.. ఈ అద్భుతమైన పాటకు మొదటి విజిల్ నాదేనంటూ మంచి బూస్టింగ్ ఇచ్చింది. పాపికొండల నడుమ సాగే గోదావరి అందాలను అభివర్ణిస్తూ మోటివేషనల్ టచ్ ఇస్తున్న ఈ సాంగ్‌లో మణిశర్మ అందించిన బాణీలు హైలైట్ అవుతున్నాయి. కాసర్ల శ్యామ్ అందించిన లిరిక్స్‌పై యువ సింగర్లు అనురాగ్ కులకర్ణి, రేవంత్, వరంలు ఈ పాటను ఎంతో మధురంగా ఆలపించారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్ నెం.3గా హై బడ్జెట్, అత్యున్నత సాంకేతిక విలువలు జోడించి ఈ మూవీ రూపొందిస్తున్నారు నిర్మాత శ్రీనివాసా చిట్టూరి. గోపీచంద్, తమన్నా హీరో హీరోయిన్లుగా నటించగా.. సీనియర్ హీరోయిన్ భూమిక కీలక పాత్ర పోషించింది. హాట్ బ్యూటీ అప్సరా రాణి ఐటెం సాంగ్ చేయడం విశేషం. రావు రమేష్, తరుణ్ అరోరా, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణమురళి ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. చిత్రాన్ని ఏప్రిల్ 2వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3qaI0TJ
No comments:
Post a Comment