ఇటీవలి కాలంలో వరుసపెట్టి బిగ్ ప్రాజెక్ట్స్‌లో భాగమవుతూ తన బాణీలతో కట్టిపడేస్తున్నారు తమన్. తనదైన మ్యూజిక్‌తో మ్యాజిక్ చేస్తూ ప్రేక్షకుల మెప్పు పొందుతున్నారు. గతేడాది 'అల.. వైకుంఠపురములో' సినిమాకు ఆయన అందించిన బాణీలు నేటికీ రికార్డుల మోత మోగిస్తున్నాయి. ఇకపోతే హీరోగా వస్తున్న ‘వకీల్ సాబ్’, మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న ‘సర్కారువారి పాట’ లాంటి భారీ ప్రాజెక్ట్‌లు ప్రస్తుతం చేతిలో ఉన్నాయి. కాగా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆయన, తాజాగా నెటిజన్లతో చిట్ చాట్ చేసి పలు విషయాలపై స్పందించారు. మహేష్ బాబు- కీర్తి సురేష్ జంటగా రూపొందుతున్న 'సర్కారు వారి పాట' సినిమా నుంచి ఎన్నో సర్‌ప్రైజ్‌లు రాబోతున్నాయని తమన్ తెలిపారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆగస్టు నెలలో ఈ సినిమా సాంగ్స్‌తో మనం కలుసుకుందామని చెబుతూ మహేష్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఇక 'వకీల్ సాబ్' సాంగ్స్ అద్భుతంగా వచ్చాయని పేర్కొన్న ఆయన, తన దృష్టిలో పవన్ ఓ లీడర్ అని తెలుపుతూ మెగా అభిమానుల్లో జోష్ నింపారు. కాగా, ఈ చిట్ చాట్‌లో భాగంగా 'సోషల్‌మీడియాలో మీపై వస్తున్న ట్రోల్స్ గురించి మీ స్పందన చెప్పండి' అని ఓ నెటిజన్ అడగడంతో వెంటనే ఓపెన్ అవుతూ అసలు అలాంటివి తాను పట్టించుకోనని చెప్పారు. తనపై ట్రోల్స్ క్రియేట్ చేయడం కోసం వాళ్లు తమ విలువైన సమయాన్ని వృథా చేసుకుంటున్నారు తప్ప మరోటి లేదంటూ ట్రోలర్స్‌కి దిమ్మతిరిగే సమాధానమిచ్చారు. సో.. చూడాలి మరి ''వకీల్ సాబ్, సర్కారు వారి పాట'' తమన్ ఇంకెలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తారనేది!.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3sSuDcz
No comments:
Post a Comment