సినిమాల్లోకి రావాలని అక్కడ రాణించాలని చాలా మందికి ఉంటుంది.. కొంతమంది రాణిస్తారు.. మరికొంతమంది ఆశల్ని వదిలేసుకుంటారు. ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉంటే సినిమాల్లో చేయడం పెద్ద కష్టం కాదు.. కానీ ఎలాంటి బ్యాగ్రౌండ్ లేనివాళ్లు సినిమాల్లో రాణించి సొంత ఐడెండిటీ సాధించాలంటే పెద్ద యుద్దమే చేయాలి.. అలాంటి యుద్దమే చేశాడు యువ నటుడు . ఒక్క ఏడాది కాదు.. రెండు ఏడాది కాదు.. ఏకంగా పదేళ్లు పాటు స్ట్రగుల్స్ ఎదుర్కొన్నాడు. అయితే ఇవన్నీ స్ట్రగుల్స్ కాదని.. తన ఇష్టాన్ని చేరుకోవడం ఎదురైన సవాళ్లని అద్భుతంగా చెప్పాడు నవీన్ పోలిశెట్టి. అతని సినిమా కష్టాలు కళ్లు చెమర్చేవిధంగా ఉన్నా.. ఎంతో మంది యువ నటీ నటులకు మార్గదర్శకాలుగా ఉన్నాయి. ఇంతకీ నవీన్ ఏమన్నాడంటే.. ‘2009లో మొదలుపెడితే 2019లో నాకు మంచి సినిమా పడి గుర్తింపు వచ్చింది. సక్సెస్ చూసింది ఈ నాలుగేళ్లే.. ఏడేళ్లు పాటు చాలా స్ట్రగుల్స్.. అందులో భోజనం చేయని రోజులు ఉన్నాయి. నాకు 4-5 చదివేటప్పుడే యాక్ట్ చేయాలని అనిపించేది. అక్కడ నాకు విత్తనం పడింది. నాకు ఊహ తెలిసినప్పటి నుంచీ ఇదే నా గోల్. కానీ దాని కోసం నేను చేస్తున్న ఈ ప్రయత్నం నాకు స్ట్రుగుల్ అని అనిపించలేదు. తిండిలేని వాడ్ని ఇది తినరా అని ఇస్తుంటే అది స్ట్రగుల్ కాదు.. వాడికి తినడం ఇష్టం కాబట్టి.. నాకూ సినిమా అంతే. పాటల్ని ఇష్టపడే వాడికి పాడమని అవకాశం ఇస్తే అది స్ట్రగుల్ కాదు. సినిమా కోసం నేను పడ్డ కష్టం ఏదీ నేను స్ట్రగుల్‌గా ఫీల్ అవ్వలేదు. అసలు నా స్ట్రగుల్ ఏంటి అంటే.. నేను ఇంజనీరింగ్ చేసి ఒక జాబ్ చేస్తూ నాకు సంబంధంలేని కోడింగ్ చేయడం అది అసలు స్ట్రగుల్. అప్పుడు అనిపించింది.. డబ్బు గిబ్బు కాదు.. ముందు ఇక్కడ నుంచి బయటపడాలని అనుకున్నా. దాని నుంచి ఎప్పుడైతే నేను బయట పడ్డానో నా స్ట్రగుల్ ఎండ్ అయ్యింది. సినిమా ప్రయాణం మొదలుపెట్టాక ఛాలెంజెస్ మొదలయ్యాయి. ఆ ప్రయాణంలో ఎక్కడా కూడా వన్ పాయింట్ కూడా ఇక్కడికి ఎందుకొచ్చాం రా బాబూ అని అనిపించలేదు. కాకపోతే నేను ఫస్ట్ థియేటర్ ఆర్టిస్ట్‌గా చేసేవాడిని మహా అయితే మూడు నెలలకు ఒక షో ఉండేది. దానికి కూడా ఓ 20 మంది కంటే ఎక్కువ రారు. దానికి 750 రూపాయలు వచ్చేవి. మూడు నెలలు రిహార్సల్ చేసి పర్ఫామ్ చేస్తే వచ్చే డబ్బు రూ.750రూ. దాంతో సర్దుకోవడం చాలా కష్టం అయ్యేది. ఇంట్లో డబ్బులు అడగలేం.. మాది చాలా సాధారణ కుటుంబం.. వాళ్ల దగ్గర డబ్బులు లేవు.. ఫైనాన్సియల్‌గా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా.. రకరకాల పనులు చేసేవాడిని. మాల్స్‌లో పెర్ఫామ్ చేసి పిల్లల్ని ఆడించడం.. అప్పట్లో నోకియా ఫోన్స్‌కి వాయిస్ ఓవర్ ఇచ్చేవాడిని.. రేడియో జింగిల్స్ చేసేవాడిని. ఇలా చాలా పనులు చేసేవాడిని. ఖర్చులు తక్కువ పెట్టుకునేవాడిని. చిన్న రూంలో ఉండేవాడిని. ముంబాయి వెళ్లినప్పుడు ఖర్చులు చాలా ఎక్కువయ్యేవి. అడుగుతీసి అడుగువేస్తే ఐదొందలు లేచిపోయేవి. అలాంటి టైంలో చాలా పొదుపుగా ఉండేవాడిని. పొద్దున్నే లేస్తే ఆకలివేసేది.. టిఫిన్ చేస్తే ఖర్చు అని డైరెక్ట్‌గా మధ్యాహ్నం లేని రైస్ పెట్టుకుని ఆడిషన్స్‌కి వెళ్లిపోయేవాడిని. బ్రేక్ ఫాస్ట్ చేస్తే డబ్బులు అయిపోతాయి.. మళ్లీ లంచ్ టైంకి ఆకలివేస్తుందని అలా చేసేవాడిని. సినిమాల్లో ఇలాంటివి చూస్తుంటాం కానీ.. నా లైఫ్‌లో కూడా ఉన్నాయి.. బట్ అవన్నీ ఛాలెంజింగ్ గానే ఉన్నాయి. యాక్టర్ కావాలని.. ఛాన్స్ కోసం ఎదురు చూసేవాడికి టైం లేకపోవడం అనేది ఉండదు.. పొట్ట నింపుకోవడానికి ఆ టైంలో చాలా ప్రయత్నాలు చేయొచ్చు. దేని దారి దానిదే. న్యూయార్క్ వెళ్తే.. అక్కడ రెస్టారెంట్స్‌లో కనిపించే అమ్మాయిలు, అబ్బాయిలు అంతా యాక్టర్సే. ఇండియాలో సెపరేట్ జోన్ ఉంది. ఫాదర్ డైరెక్టర్, ప్రొడ్యుసర్ అయ్యి ఉంటే.. వీటన్నింటినీ బ్రేక్ చేసి డైరెక్ట్ యాక్టర్ అవ్వొచ్చు. కానీ బయట ఇండస్ట్రీలలో అలా ఉండదు. కానీ నా ఫేవరేట్ యాక్టర్స్ అంతా స్ట్రగుల్స్ అనుభవించి వచ్చిన వాళ్లే.. అందుకే నేనూ ఫాలో అయ్యా’ అంటూ చెప్పుకొచ్చాడు నవీన్ పోలిశెట్టి. సివిల్ ఇంజనీర్ అయిన నవీన్.. యూట్యూబ్‌లో పలు షార్ట్ ఫిల్మ్స్‌లో నటించి ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’తో సక్సెస్ అందుకున్నాడు. విలక్షణ నటుడిగా తొలి చిత్రంతోనే పేరు సంపాదించాడు. 2019లో ఈ చిత్రం విడుదల కాగా.. అదే ఏడాదిలో ‘చిచోర్’ అనే బాలీవుడ్ మూవీలోనూ నటించాడు ప్రశంసలు అందుకున్నాడు. ప్రస్తుతం నవీన్ పోలిశెట్టి నటించిన ‘’ సినిమా విడుదల కానుంది. అంతకు ముందు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, డి ఫర్ దోపిడీ, నేనొక్కడినే చిత్రాల్లో నటించాడు నవీన్ పోలిశెట్టి.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3uSAm3W
No comments:
Post a Comment