యూట్యూబ్‌లో డబ్ స్మాష్ ఆర్టిస్ట్‌గా ఫేమస్ అయిన జూనియర్ సమంతగా పాపులారిటీ సంపాదించింది. బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్‌లో పాల్గొని మరింత మందికి దగ్గరైంది. అప్పటినుంచి సోషల్ మీడియాలో రెగ్యులర్ అప్‌డేట్స్‌తో టచ్‌లో ఉంటున్న ఆమె.. రీసెంట్‌గా తన ఇన్స్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో దిగిన ఫోటో, ఆయన రాసిన లేఖను పోస్ట్ చేస్తూ డైరెక్టర్ క్రిష్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది. క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న మూవీ కోసం సెట్స్‌పై ఉండగా, అక్కడే అషూ రెడ్డి నటిస్తున్న ఓ చిత్ర షూటింగ్ కూడా జరుగుతోంది. దీంతో తన అభిమాన హీరో పవన్‌ను కలిసేందుకు వెళ్లిన అషూ రెడ్డితో పవన్ ఏకంగా 2 గంటల పాటు ఆప్యాయంగా ముచ్చటించారు. ఇక అంతుపట్టని ఆనందంతో వెంటనే ఆ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ డైరెక్టర్ క్రిష్‌కు స్పెషల్ థాంక్స్ చెప్పేసింది అషూ. దీంతో ఇక్కడే వచ్చి పడింది అసలు చిక్కు. ఆ ఆనందంలో తప్పు చేసేసింది అషూ రెడ్డి. డైరెక్టర్ క్రిష్‌కు ఇన్స్‌స్టాగ్రామ్ ఖాతా లేదనే విషయం గుర్తించని అషూ.. క్రిష్ పేరుతో ఉన్న ఏదో ఒక ఖాతాను ట్యాగ్ చేసింది. దీంతో ఇది పసిగట్టిన నెటిజన్స్ రచ్చ మొదలుపెట్టారు. అది ఫేక్ ఖాతా అని తెలియని ఇంకొందరు క్రిష్ ఖాతాను ఫాలో కావడం స్టార్ట్ చేశారు. ఈ విషయం చివరకు క్రిష్ వద్దకు కూడా వెళ్లిందట. దీంతో ఇదే విషయాన్ని అషూకి చెప్పడంతో ఆమె తన తప్పును సరిదిద్దుకుంది. తాను చేసిన పోస్ట్‌లో క్రిష్ పేరును తొలగించిన అషూ రెడ్డి.. డైరెక్టర్ క్రిష్ గారు ఇన్‌స్టాలో లేరు.. ఆయనకు ఎలాంటి ఖాతా లేదు. ఆయన పేరుతో ఉన్న ఖాతాను ఎవ్వరూ ఫాలో కావొద్దు. ఇది ఆయన పర్సనల్ రిక్వెస్ట్ అంటూ అషూ తన సోషల్ మీడియా వాల్‌పై ఓ పోస్ట్ చేసింది. మొత్తానికైతే అషూ అత్యుత్సాహం క్రిష్ అభ్యర్థన వరకూ వెళ్లడం విశేషం.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3sITW0z
No comments:
Post a Comment