టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతుండటం, సోషల్ మీడియా హవా పెరిగిపోతుండటంతో ఒకరిపై ఒకరు తమ తమ అభిప్రాయాలను వెలిబుచ్చడం చాలా ఈజీ అయింది. తమ తమ సోషల్ మీడియా వాల్‌పై వీడియోలతో తాము చెప్పాలనుకుంటున్న విషయాలను ఓపెన్‌గా చెప్పేస్తున్నారు సినీ తారలు. ఈ క్రమంలోనే తాజాగా సంచనల తార శ్రీ రెడ్డి.. బీజేపీ యువ మహిళా నేత, హీరోయిన్ మాధవీలతపై రెచ్చిపోతూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఒసేయ్ నువ్వేమన్నా తోపా? అంటూ రచ్చకు తెరలేపింది. దీంతో వర్సెస్ వ్యవహారం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ ఇష్యూగా మారింది. ఇంతకీ ఉన్నట్టుండి మాధవీలతపై శ్రీ రెడ్డి ఇంతలా ఎందుకు విరుచుకుపడింది అనే కదా మీ డౌట్. అక్కడికే వద్దాం.. రీసెంట్‌గా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా చాలామంది ప్రముఖులు ఆయనకు బర్త్ డే విషెస్ చెప్పారు. పవన్ విధేయురాలైన మాధవీలత కూడా తన సినిమాలను డెడికేట్ చేస్తూ పోస్టర్స్ విడుదల చేసి స్పెషల్‌గా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పింది. అయితే అందరికీ ప్రత్యేకంగా థాంక్స్ చెప్పిన పవన్.. తనకు మాత్రం చెప్పకపోయే సరికి కాస్త హర్ట్ అయిన మాధవీలత నిజమైన ఫ్యాన్స్ ఎవరో గుర్తించి రిప్లై ఇవ్వండి అంటూ పవన్‌పై ఫైర్ అయింది. Also Read: ఇది చూసిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్.. పులి ఉచ్చులో పడింది. సమాజానికి మరో ఛీరెడ్డిలా మిగిలిపోవద్దు. తస్మాత్ జాగ్రత్త అని ఆమెకు కామెంట్ పెట్టారు. దీనిపై రియాక్ట్ అయిన మాధవీలత తనను చీప్ వ్యక్తులతో పోల్చుతున్నారని, కంపారిజన్స్ మానేస్తే మంచిదని చెప్పింది. అంతటితో ఆగక నేనేమీ మేకను, గొర్రెను కాదని పులిని అని పేర్కొంది. ఇది చూసి మాధవీలతపై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతూ వీడియోతో వార్నింగ్ ఇచ్చింది శ్రీ రెడ్డి. బీజేపీ అంటే తనకు ఇష్టమని చెప్పిన శ్రీ రెడ్డి.. ఆ బీజేపీలో నుంచి మహాతల్లి మాధవీలతను గెంటేయండి అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. తోపు, తురుము, పులి అని చెప్పుకుంటున్నావ్.. ఒసేయ్ నీ బతుకేంది? నువ్వెంది.. నువ్వు ఎక్కడినుంచి వచ్చావ్. నువ్ చేసిన సినిమాలెన్ని? దేశానికి సేవ చేసిన పెద్ద నాయకురాలిలా నీ కవితలు.. నువ్వు అంటూ రెచ్చిపోయింది శ్రీ రెడ్డి. నన్ను ఎవ్వరితోనూ పోల్చొద్దు అంటావా? కావాలని కాంట్రవర్సీలు క్రియేట్ చేస్తున్న నువ్వు.. పులి అంటున్నావ్.. నువ్ ఏ పులివో నాకు తెలియదు కానీ ఫస్ట్ నువ్వు బీజేపీ నుంచి బయటకు వచ్చెయ్ అనేస్తూ ఫైర్ అయింది. Also Read: ''ఓ ఆడదానిలా మాట్లాడు. మాధవీలత గారు మీరు పులితో అయినా పందితో అయినా కంపేర్ చేసుకోండి గానీ.. నీ ఫేస్‌బుక్‌లో నా గురించి కామెంట్స్ వస్తే రెస్పాండ్ కాకు. యామినికి నీకు కంపారిజాన్ లేదు. బీజేపీలో తోపు తురుము అని ఫీల్ కాకు. బతకడం నేర్చుకో ముందు. సమాజంలో ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయి. చెత్త కవితలు రాయకుండా వాటి గురించి మాట్లాడు ఫేస్‌బుక్ ఓపెన్ చేసి. ఇంకొక్కసారి నా టాపిక్ వచ్చిందంటే బిడ్డా.. ఇంకోలా ఉంటుంది. నాకు బీజేపీ అంటే ఇష్టం కాబట్టి నిన్ను ఈ రోజుకి వదిలేస్తున్నా'' అంటూ ఓ రేంజ్‌లో రెచ్చిపోయింది శ్రీరెడ్డి.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2FtSrQI
No comments:
Post a Comment