చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. మూడేళ్ల క్రితం టాలీవుడ్‌ను కుదిపేసిన డ్రగ్స్ వ్యవహారం ఇప్పుడు మళ్లీ చర్చనీయాంశంగా మారింది. అటు బాలీవుడ్‌తోపాటు ఇటు శాండిల్‌వుడ్, టాలీవుడ్‌లో కలకలం సృష్టిస్తోంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో భాగంగా రియా చక్రవర్తి డ్రగ్స్ వ్యవహారం బయటపడిన సంగతి తెలిసిందే. ఆమె డ్రగ్స్ తీసుకున్నట్టు, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు ఇచ్చినట్టు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో గుర్తించింది. దీంతో రియాను ఎన్సీబీ కస్టడీలోకి తీసుకొని విచారించింది. ఈ విచారణలో , సారా అలీ ఖాన్‌తో పాటు మొత్తం 25 పేర్లను రియా వెల్లడించింది. రియా చక్రవర్తి డ్రగ్స్ కేసు విచారణలో రకుల్ ప్రీత్ సింగ్ పేరు బయటపెట్టగానే ఈ వార్త మీడియాలో చక్కర్లు కొట్టింది. సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయ్యింది. మరోవైపు, రకుల్ హైదరాబాద్ సమీపంలోని వికారాబాద్‌లో షూటింగ్‌లో ఉన్నారు. శనివారం ఉదయం ఆమె షూటింగ్‌లో పాల్గొన్నారు. అయితే, ఆమె షూటింగ్‌లో ఉండగానే డ్రగ్స్ కేసులో తన పేరు కూడా ఉన్నట్టు తెలిసింది. అంతేకాకుండా, మీడియాలో వస్తోన్న వార్తలతో కలత చెందిన రకుల్.. అర్ధాంతరంగా షూటింగ్ నుంచి హైదరాబాద్ వచ్చేశారని సమాచారం. ప్రస్తుతం ఆమె జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఉన్నారు. సినిమా షూటింగ్‌లో పాల్గొనడానికి కొన్ని రోజుల క్రితమే రకుల్ ప్రీత్ సింగ్ హైదరాబాద్‌కు వచ్చారు. Also Read: ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్‌తో కలిసి రకుల్ నటిస్తున్నారు. వికారాబాద్ ఫారెస్ట్‌లో ఈ షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఒకే ఒక్క షెడ్యూల్‌లో కేవలం 40 రోజుల్లో ఈ సినిమాను పూర్తిచేయనున్నట్టు ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమైంది. ఈ చిత్రానికి యం.యం.కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. జ్ఞాన శేఖర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3mca9sK
No comments:
Post a Comment