బర్త్ డే వేడుకల్లో భాగంగా భారీ కటౌట్ కడుతుండగా.. సెప్టెంబర్ 1వ తేదీన విద్యుదాఘాతానికి గురై ముగ్గురు పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలోని శాంతిపురం మండలం ఏడవమైలు గ్రామంలో జరిగిన ఈ దుర్ఘటన.. యావత్ మెగా అభిమాన వర్గాలను కలచివేసింది. ఈ విషయం తెలిసిన వెంటనే పవన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ చనిపోయిన మృతుల కుటుంబాలకు ఆర్ధిక సాయం ప్రకటించారు. ఆ వెంటనే విషయం తెలిసి అల్లు అర్జున్, , దిల్ రాజు, ఏఎం రత్నం సహా కొందరు ఎన్నారైలు తమ తమ సాయం ప్రకటించారు. నిన్న (శుక్రవారం) పవన్ కళ్యాణ్ సహా వాళ్లంతా అందించిన ఆర్ధిక సాయాన్ని చెక్కుల రూపంలో బాధిత కుటుంబాలకు అందజేశారు జనసేన నాయకులు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ 13.25 లక్షల చెక్‌తో పాటు గాయపడిన వారికి ఒక్కొక్కరికీ 1.25 లక్షల చొప్పున చెక్కులు ఇచ్చారు. ఈ సందర్భంగా తన అభిమానుల కుటుంబాల సహాయార్థం మానవత్వంతో ముందుకొచ్చి సాయం చేసిన వారందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేస్తూ ట్వీట్స్ పెట్టారు పవన్ కళ్యాణ్. Also Read: కడపల్లి దుర్ఘటన బాధితుల కుటుంబాలను ఆదుకోవడానికి ముందుకొచ్చి ఒక్కో మృతుడి కుటుంబానికి రెండున్న లక్షల చొప్పున మొత్తం మూడు కుటుంబాలకు కలిపి 7.5 లక్షలు సాయం చేసిన రామ్ చరణ్‌కి, అలాగే ఒక్కో మృతుడి కుటుంబానికి 2 లక్షల రూపాయల చొప్పున మొత్తంగా 6 లక్షలు సాయం చేసిన అల్లు అర్జున్‌కి ప్రత్యేక ధన్యవాదాలు అంటూ పవన్ తన ట్వీట్స్‌లో పేర్కొన్నారు. అలాగే ఈ దుర్ఘటనలో మరణించిన జనసైనికుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించిన నిర్మాత దిల్ రాజుకు, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌కు హృదయ పూర్వక ధన్యవాదాలు అని పేర్కొన్న పవన్ కళ్యాణ్.. ఆ వెంటనే మరో నిర్మాత ఏఎం రత్నంకు, మైత్రి నిర్మాతలకు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి విషాద సమయంలో మీరు చూపించిన మానవత్వం గురించి మాటల్లో చెప్పలేం అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/32ppcYm
No comments:
Post a Comment