కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి చేపట్టిన ‘’కి మంచి స్పందన లభిస్తోంది. ప్రజలంతా స్వచ్ఛదంగా ఇళ్లలో నుండి బయటకు రాకుండా ప్రధాని మోడీ పిలుపుకి మద్దతు ప్రకటించారు. జనం బయటకు రాకపోవడంతో ఎక్కడ చూసినా రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ఈ జనతా కర్ఫ్యూకి సెలబ్రిటీలు సైతం మద్దతు ప్రకటించారు. అయితే ఒక్కరోజు కర్ఫ్యూ పాటిస్తే వైరస్ ఆగిపోతుందా?? జనం ఏం చేయాలో కాదు.. ముందు ప్రభుత్వం ఏం ఎలాంటి చర్యలు చేపడుతుందో చెప్పండి? అంటూ జనతా కర్ఫ్యూపై చాలామంది సోషల్ మీడియాలో జోక్‌లు వేస్తున్నారు. మరికొంతమంది అయితే ఇళ్లలో ఉండటం మా వల్ల కాదు బాబు అంటూ కామెంట్ చేస్తుండటంతో దర్శకుడు తనదైన శైలిలో స్పందిస్తూ తన మార్క్ డైలాగ్‌లతో వీడియో వదిలారు. Read Also: మన ప్రధాని ఎందుకు చెప్పారో.. ఆయన మాట విందాం.. మనం అంతా ఇంట్లోనే ఉందాం. ఇలా ఉంటే.. కరోనా వైరస్ తాలూకు చైన్ కట్ అవుతుందని పెద్దలందరి అభిప్రాయం. దాన్ని గౌరవించి ఇంట్లోనే ఉందాం. ఇవాళ కరోనా లేని ప్లేస్‌లోకి ఎవరైనా వెళ్లాలి అనుకుంటే ఓ ఊరు ఉంది. ఆ ఊరుపేరు ఏంటంటే.. ఊహాన్. చైనాలో కరోనా వస్తే.. కంట్రీ మొత్తం కట్టకట్టుకుని కరోనాని చావగొట్టారు. మనం కూడా అలా చేయాలి అంటే.. చెప్పిన మాట వినండి. కొంతమంది నేను ఇంట్లో ఉండలేను.. ఫస్ట్రేట్ అయ్యి నెగిటివ్‌గా మాట్లాడేవాళ్లకు నా సలహా ఏంటంటే.. మీరు ఓ నాలుగు స్పూన్‌లు ఆముదం తాగండి. మోషన్స్ పట్టుకుంటాయ్.. ఇక మీరు ఆ పనిలో బిజీగా ఉంటారు. ఈలోపు సాయంత్రం అయిపోతుంది. హ్యాపీగా ఉంటారు. ఇలాంటి టైంలో నెగిటివ్‌గా లేకుండా చెప్పిన మాట వినండి.’ అంటూ జనతా కర్ఫ్యూని మద్దతు ప్రకటించారు పూరీ జగన్నాథ్. Read Also:
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2wsosV3
No comments:
Post a Comment