కరోనా వైరస్‌పై పోరాటంలో భాగంగా ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జనతా కర్ఫ్యూను పాటించడంతో పాటు.. మన కోసం రాత్రింబవళ్లు ప్రాణాలకు తెగించి పనిచేస్తోన్న వైద్య సిబ్బంది, పోలీసు సిబ్బంది, జవాన్లకు సంఘీభావంగా 5 గంటలకు ప్రతి ఒక్కరూ వారి ఇళ్లలోని తలుపులు, కిటికీల వద్దకు వచ్చి చప్పట్లు, గంటలు కొట్టాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ప్రజలు జనతా కర్ఫ్యూను పాటిస్తున్నారు. ప్రతి ఒక్కరూ దీనికి మద్దతుగా నిలుస్తున్నారు. అయితే, ఇక చప్పట్లు కొట్టే సమయం వచ్చింది. మనం కొట్టే ఈ చప్పట్లు ఆకాశానికి వినపడాలని అంటున్నారు పద్మశ్రీ డాక్టర్ మంచు మోహన్ బాబు. ఈ మేరకు ఆయన ఒక వీడియో మెసేజ్‌ను ట్వీట్ చేశారు. 5 గంటలకు 5 నిమిషాల పాటు చప్పట్లు కొట్టాలని.. ఆ శబ్ధం ఆకాశానికి వినపడాలని ఆయన అన్నారు. కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకుందామని పిలుపునిచ్చారు. Also Read: ‘‘పంచభూతాలను మనం గౌరవిస్తున్నట్టే మన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పినట్టు జనతా కర్ఫ్యూను మనం పాటిస్తు్న్నాం. మనందరి కోసం డాక్టర్లు, పోలీసు శాఖ, వీర జవానులు పనిచేస్తున్నారు. వాళ్ల ప్రాణాలను మనకు తాకట్టు పెట్టినట్టే. మన ఆరోగ్యం కోసం వాళ్లు కష్టపడుతున్నారు. వాళ్లకు సంఘీభావం తెలపడం కోసం ఈరోజు సాయంత్రం 5 గంటలకు 5 నిమిషాల పాటు మన చప్పట్లు ఆకాశానికి వినిపించాలి. ఆ శక్తికి వినిపించాలి. అలాగే, మనం మోగించే గంట కూడా ఆ శక్తిస్వరూపినికి వినిపించి.. దాదాపు 130 కోట్ల మంది ఉన్న మన భారతదేశ ప్రజలే గాక, ప్రపంచ వ్యాప్తంగా ఉండే ప్రజలందరూ క్షేమంగా ఉండి ఈ కరోనా మళ్లీ మళ్లీ రాకుండా కాపాడుకుందాం’’ అని మోహన్ బాబు తన వీడియోలో వెల్లడించారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2wssL2F
No comments:
Post a Comment