కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. దేశం మొత్తం లాక్‌డౌన్ ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మూడు వారాల పాటూ జనాలు ఇళ్లలో నుంచి బయటకు రాకూడదని అధికారులు, పోలీసులు హెచ్చరిస్తున్నారు. లాక్‌డౌన్ దెబ్బకు ఒక్కసారిగా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇలాంటి కష్టకాలంలో సినిమా సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు అండగా నిలుస్తున్నారు. మేమున్నామంటూ ముందుకొస్తున్నారు.. వారికి తోచిన సాయాన్ని అందిస్తున్నారు.. ప్రభుత్వాలు, ప్రజలకు అండగా నిలిచారు. ఇప్పటికే కొందరు తమ సాయాన్ని ప్రకటించారు. తాజాగా జనసేన అధినేత పవన కళ్యాణ్ పెద్ద మనసు చాటుకున్నారు. కరోనా నివారణ, సాయం కింద రెండు తెలుగు రాష్ట్రాలకు విడిగా భారీ సాయాన్ని ప్రకటించారు. ఒక్కో రాష్ట్రానికి రూ.50లక్షల చొప్పున.. రెండు రాష్ట్రాలు కలిపి రూ.కోటిని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేస్తానని తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ప్రకటన చేశారు. జనసేనాని భారీ సాయం ప్రకటించడంతో జనసైనికులు ఖుషీ అవుతున్నారు. పవన్ ఫ్యాన్స్‌గా గర్వపడుతున్నాము అంటున్నారు. ఇలాంటి కష్టకాలంలో సాయాన్ని ప్రకటించిన జనసేన అధినేతను ప్రశంసిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్‌కు మాత్రమే కాదు.. పీఎం రిలీఫ్ ఫండ్‌కు సాయం ప్రకటించారు. రూ.కోటి అందిస్తున్నట్లు పవన్ తెలిపారు. అలాగే ఇలాంటి విపత్కర సమయంలో ప్రధాని మోదీకి తన మద్దతు ఉంటుందన్నారు. ఆయన నాయకత్వంలో కరోనా ముప్పు నుంచి దేశం సురక్షితంగా బయటపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ ఇటీవలే అమర సైనికుల కుటుంబాల సంక్షేమం కోసం కేంద్రీయ సైనిక్ బోర్డుకు కోటి రూపాయలను విరాళంగా అందజేశారు. ఆర్మ్‌డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే సందర్భంగా.. సైనికుల కుటుంబాల కోసం కోటి రూపాయలు విరాళంగా ఇస్తానని డిసెంబర్ 6, 2019న ప్రకటించారు. అన్నమాట ప్రకారం పవన్ నేడు (ఫిబ్రవరి 20న) చెక్కును డిల్లీలో అందజేశారు. అంతేకాదు మరో రూ.కోటి విరాళాలు సేకరించే పనిలో ఉన్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2yagUXA
No comments:
Post a Comment