Wednesday 25 March 2020

కరోనాను పట్టించుకోని రాజమౌళి... RRRపై వెనక్కి తగ్గని దర్శకధీరుడు

ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు కరోనాపై ఆందోళన చెందుతున్న వేళ... దర్శక ధీరుడు అందరికీ ఓ ఉపశమనం అందించాడు. ప్రేక్షకులు ఎంతగానే ఎదురు చూస్తున్న ... RRR మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశాడు. టైటిల్ లోగో, మోషన్ పోస్టర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయాయి. హీరోల బ‌ర్త్‌డేల‌కి, పెద్ద పండుగ‌ల‌కి రాజమౌళి ఏమైనా గుడ్ న్యూస్ అందిస్తాడేమోనని అభిమానులంతా ఎదురు చూశారు. కానీ రాజ‌మౌళి ఉగాది సంద‌ర్భంగా మోష‌న్ పోస్ట‌ర్‌తో పాటు టైటిల్ అనౌన్స్ చేశాడు. ‘రౌద్రం, రణం, రుధిరం’ అనే టైటిల్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్ర మోష‌న్ పోస్ట‌ర్ కూడా ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. ‘బాహుబలి’ సిరీస్ సినిమాలతో తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకధీరుడు రాజమౌళి స్వాతంత్ర్య నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ఫిల్మ్ టైటిల్‌పై నెలకొన్న ఉత్కంఠకు తెరదించేశాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురం భీమ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్న ఈ క్రేజీ ప్రాజెక్టుకి ఎట్టకేలకు ‘రౌద్రం రణం రుధిరం’ పేరు ఖరారు చేశారు. అంచనాలకు ఏమాత్రం అందకుండా జక్కన్న ఈ RRR ‘రౌద్రం రణం రుధిరం’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడని అర్థమవుతుంది. సినిమాను 2021 జనవరి 8న విడుదల చేయనున్నారు. అయితే కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ సినిమా విడుదలపై మాత్రం రాజమౌళి ఏమాత్రం వెనక్కి తగ్గనట్లు కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే అంతా సినిమా షూటింగ్స్ బంద్ చేశారు. తారలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. ఈ సంవత్సరం జులై 30న RRR రిలీజ్ కావాల్సి ఉన్నా.... కొన్ని నెలల క్రితమే వచ్చే ఏడాది 2021 జనవరిన రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కడా కూడా ఆ సూచనలు కనపడటం లేదు అని ప్రేక్షకులంతా భావిస్తున్నారు. RRR షూటింగ్ ముగిద్దాం అనుకుంటున్న టైంలో కరోనా వైరస్ ప్రబలడంతో సినిమా షూటింగ్ నిలిపేశారు. కానీ చిత్రయూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించే దిశగా ప్లాన్ చేస్తుందట కరోనా ఎఫెక్ట్ తో మళ్లీ సినిమా విడుదల వాయిదా పడుతుంది అనుకున్నారంతా.. కానీ మోషన్ పోస్టర్ లో మాత్రం యధావిధిగానే 2021జనవరి 8న విడుదల చేయనున్నట్లు స్పష్టంగా తెలిపారు రాజమౌళి. ఇక్కడ మరో విషయం కూడా ప్రేక్షకులు గుర్తించారు. ఈ సినిమాలో అలియా భట్ ఉంటుందా లేదా అన్న దానిపై కూడా సస్సెన్స్ నడిచింది. సినిమా నుంచి ఆమె తప్పుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే ఇదే సమయంలో అలాంటి వార్తలకు చెక్ పెట్టే వింగా పోస్టర్ లో అలియా పేరును కూడా చేర్చారు. అంటే అలియా కూడా సినిమాలో ఉన్నట్లు అందరికీ స్పష్టం చేశారు. అయితే అన్ని విషయాలు కరాఖండిగా చెప్పేసినా.. విలన్ విషయంలో మాత్రం సస్పెన్స్ కంటిన్యూ చేశారు. బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ లేకపోతే ఈ ఇద్దరి హీరోల్లో ఎవరో ఒకరిని విలన్‌గా చూపిస్తారా అన్నది మాత్రం కొంత సస్పెన్స్ లో ఉంచాడు రాజమౌళి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2WFFKJ7

No comments:

Post a Comment

'Kashmir Needs A Bal Thackeray'

'Afzal Guru became a victim of Pakistan's conspiracy. He was used as a means, just like all other innocent Kashmiris.' from re...