తమిళ టాప్ కమెడియన్ యోగి బాబు ఓ ఇంటి వాడు అయ్యాడు. తమిళనాడులోని వెల్లూరుకు చెందిన మంజు భార్గవిని నేడు (ఫిబ్రవరి 5) వివాహం చేసుకున్నారు . ఈ వివాహ వేడుకకు సన్నిహితులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. కుటుంబ సంప్రదాయం ప్రకారం తమిళనాడు తిరుతనిలో ఈ వివాహం జరిగింది. కాగా యోగిబాబు తన వివాహం విషయాన్ని చాలా సీక్రెట్‌గా ఉంచారు. మీడియాకు పొక్కకుండా సన్నిహితుల మధ్య ఈ వివాహాన్ని చేసుకోవడం విశేషం. కాగా ఈ వివాహం కుటుంబం ఏర్పాటు చేసిన వివాహం అని.. రిసెప్షన్‌ను వచ్చే నెలలో చెన్నైలో నిర్వహించనున్నట్టు తమిళ మీడియా తెలిపింది. తమిళ స్టార్ హీరోలు చిత్రాలతో పాటు సూపర్ స్టార్ రజినీకాంత్ చిత్రంలో తప్పకుండా నటిస్తారు యోగి బాబు. ఇటీవల రజినీకాంత్ దర్బార్‌లోనూ కీలకపాత్ర పోషించారు యోగిబాబు. ప్రస్తుతం తమిళ్‌లో బిజీ కమెడియన్‌గా అత్యధిక పారితోషికం తీసుకునే కమెడియన్‌గా టాప్ ప్లేస్‌లో ఉన్నారు యోగిబాబు. ప్రస్తుతం మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ధనుష్ చిత్రం కర్ణన్‌లో చేస్తున్నారు యోగి బాబు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3bhx7cH
No comments:
Post a Comment