దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘’. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ సూపర్‌స్టార్ ఇందులో కీలక పాత్రలో కనిపించనున్నారు. అయితే ఈ సినిమాలో తన పాత్ర కోసం అజయ్ దేవగణ్ ఒక్క రూపాయి కూడా పారితోషికంగా తీసుకోలేదట. ఈ మేరకు టాలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. నిర్మాత డీవీవీ దానయ్య అజయ్ దేవగణ్ మార్కెట్ వాల్యూకి తగ్గట్టు రెమ్యునరేషన్ ఇస్తానన్నారట. అంతేకాదు తారక్, రామ్ చరణ్‌కి ఇచ్చినంతే ఇస్తామన్నారట. కానీ అజయ్ వద్దని చెప్పారట. ఇంత గొప్ప సినిమాలో తనకు నటించే అవకాశం వచ్చినందుకు సంతోషించాలి కానీ డబ్బుతో పోల్చి చూడకూడదని అన్నారట. అదీకాకుండా అజయ్‌కి రాజమౌళి మంచి స్నేహితుడు. జక్కన్న తెరకెక్కించిన ‘ఈగ’ సినిమాను హిందీలో ‘మక్కీ’ పేరుతో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ఈగ పాత్రకు అజయ్ దేవగణ్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. అప్పటినుంచి రాజమౌళి, అజయ్ మంచి స్నేహితులయ్యారు. రాజమౌళిపై గౌరవంతోనే ఈ సినిమాలో ఉచితంగా నటించడానికి అజయ్ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. READ ALSO: ఇకపోతే RRR విడుదల వాయిదా పడుతుందని గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ కూడా RRR వాయిదా పడుతున్నట్టు పరోక్షంగా వెల్లడించారు. దీంతో సినిమా వాయిదాపై అందరికీ క్లారిటీ వచ్చింది. మహా అయితే రెండు మూడు నెలలు వాయిదా పడుతుందేమో అనుకున్నారు. కానీ, ప్రేక్షకులకు ఊహించని షాక్ ఇచ్చారు రాజమౌళి. సినిమా విడుదలను ఏకంగా 2021కి వాయిదా వేసేశారు. 2021 జనవరి 8న సినిమాను విడుదల చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. READ ALSO:
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2UAdR4d
No comments:
Post a Comment