ప్రముఖ యాంకర్ భరద్వాజ్ మెగా ఆఫర్లు తన్నుకొస్తున్నాయి. గతంలో అనసూయ ‘క్షణం’, ‘రంగస్థలం’ సినిమాలతో తానేంటో నిరూపించుకున్నారు. ‘కథనం’ సినిమాలో లీడ్ రోల్‌లో నటించి సినిమాను తన భుజాలపై మోసారు. ఎలాంటి పాత్రలోనైనా నటించే సత్తా ఉందని నిరూపించుకున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్నట్లు చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసినట్లు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అందుకే మెగా ఆఫర్లు కూడా వస్తున్నట్లు తెలుస్తోంది. క్రిష్ జగర్లమూడి దర్శకత్వంలో పవన్ ఓ సినిమాలో నటించనున్న సంగతి తెలిసిందే. ఇందులో అనసూయ కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. సినిమాలో ఆమె పాత్ర అరగంట సేపే ఉన్నప్పటికీ సినిమాకు చాలా కీలకం అని ఫిలిం వర్గాల సమాచారం. అనసూయ కోసం ఓ పాటను కూడా యాడ్ చేయబోతున్నారట. ఇందులో పవన్ పాత్ర రాబిన్ హుడ్ తరహాలో ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ ‘పింక్’ తెలుగు రీమేక్‌తో బిజీగా ఉన్నారు. వేణు శ్రీరామ్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్‌కు సంబంధించిన వీడియోలు కూడా లీకైపోతున్నాయి. READ ALSO: నిన్ననే పవన్ సినిమాకు సంబంధించిన ఓ వీడియో బయటికి వచ్చింది. లాయర్ కోటు వేసుకుని పవన్ ఫైట్ చేస్తూ.. ‘నేను నల్లకోటు వేసుకుంటే వేసుకోవడానికి పిటిషన్లు, తెచ్చుకోవడానికి బెయిళ్లు ఉండవు’ అనే డైలాగ్ చెప్తున్న సీన్ లీకైంది. జోకేంటంటే.. ఈ వీడియోను పవన్ ఫ్యాన్సే సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఆ తర్వాత రియలైజ్ అయ్యారో ఏమో వెంటనే వీడియోను డిలీట్ చేసేశారు. మరోపక్క బన్నీ, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాలో అనసూయ విలన్ పాత్రలో నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. READ ALSO:
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2uXZzQ7
No comments:
Post a Comment