‘ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని’.. ఈ పాట ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తూనే ఉంటుంది. 18 ఏళ్ల క్రితం , సదా జంటగా నటించిన ‘జయం’ సినిమా ఇప్పటికీ ఎవర్‌గ్రీనే. తేజ డైరెక్షన్‌లో ఆర్పీ పట్నాయక్ సంగీతంతో అప్పట్లో ఈ సినిమా బాక్సాఫీస్‌ను కుదిపేసింది. ఇప్పటికీ ఈ సినిమాకు, పాటలకు మంచి ఆదరణ ఉంది. తెలుగులో బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఏడాదికే తమిళంలో రీమేక్ చేశారు. తమిళంలో రవి, సదా జంటగా నటించారు. అక్కడ కూడా సినిమా హిట్టే. దాంతో తొలి సినిమాతోనే మంచి హిట్ అందుకోవడంతో రవి తన పేరు ముందు జయం అన్న పేరును యాడ్ చేసుకున్నారు. ఈ సంగతి అటుంచితే.. ఈ సినిమాను మళ్లీ రీమేక్ చేయబోతున్నారట. తెలుగు, తమిళంలో మంచి హిట్ అందుకున్నప్పుడు కన్నడలోనూ కచ్చితంగా హిట్ అవుతుందని భావించి కన్నడలో రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నాడు ఓ కుర్ర హీరో. ప్రవీణ్ అనే కుర్ర నటుడు ‘జయం’ సినిమాను కన్నడలో రీమేక్ చేయాలని అనుకుంటున్నారట. ప్రవీణ్ ఓ డాక్టర్. కానీ యాక్టింగ్ అంటే ప్రాణం. అందుకే దాదాపు ఏడాది పాటు నటనలో శిక్షణ తీసుకుని ‘జయం’ రీమేక్‌తో కన్నడ చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయం అవ్వాలని నిర్ణయించుకున్నాడు. త్వరలో సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందట. READ ALSO: ఓ సూపర్‌హిట్ సినిమాను రీమేక్ చేస్తే వచ్చే లభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఒకసారి హిట్ అయిన సినిమాను మళ్లీ తీస్తే అంత సహజంగా అనిపించదు. అదీకాకుండా ఏకంగా 18 ఏళ్ల క్రితం తీసిన సినిమాను ఇప్పుడు తీస్తే అంత ఆసక్తి ఉండకపోవచ్చు. ఎందుకంటే అప్పట్లో ‘జయం’ ఓ ప్రేమకథ కాబట్టి బ్లాక్ బస్టర్ అయింది. కానీ ఆ తర్వాత అలాంటి ప్రేమకథలతో ఉన్న సినిమాలు వేలల్లో వచ్చాయి. మరి ప్రవీణ్ తాను అనుకున్నది సాధిస్తాడో లేదో వేచి చూడాలి.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3b9MNyx
No comments:
Post a Comment