Thursday 6 February 2020

‘జాను’ ట్విట్టర్ రివ్యూ: ఫీల్ ద మ్యాజిక్

శర్వానంద్, సమంత జంటగా నటించిన చిత్రం ‘జాను’. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘96’ సినిమాకు ఇది రీమేక్. తమిళ వర్షన్‌కు దర్శకత్వం వహించిన ప్రేమ్ కుమారే తెలుగు వర్షన్‌ను తెరకెక్కించారు. అలాగే, ఆ చిత్రానికి పనిచేసిన గోవింద వసంత.. తెలుగుకు కూడా సంగీతం సమకూర్చారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ క్లాసిక్ మూవీ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళంలో క్లాసిక్ మూవీగా ప్రేక్షకుల మన్ననలు అందుకున్న సినిమాను తెలుగులో రీమేక్ చేయడమంటే రిస్క్ చేస్తున్నట్టే లెక్క. ఎందుకంటే కచ్చితంగా పోలిక వస్తుంది. చాలా మంది ఇప్పటికే ఈ సినిమాను తమిళంలో చూసేశారు. తెలుగులో చూసినప్పుడు కచ్చితంగా దాన్ని దీన్ని పోల్చి చూస్తారు. త్రిష బాగా చేసిందా, సమంత బాగా చేసిందా అని లెక్కలేసుకుంటారు. విజయ్ సేతుపతిని శర్వానంద్ మరపించగలిగాడా అని కూడా చూస్తారు. మరి ఇన్ని విశ్లేషణల మధ్య ‘జాను’ ప్రేక్షకులను మెప్పించడమంటే మామూలు విషయం కాదు. నిజానికి ‘96’ మూవీ కాస్త నెమ్మదిగా సాగుతుంది. కానీ, సినిమాలో మంచి ఫీల్ ఉంటుంది. ముఖ్యంగా ప్రేమకథలు ఇష్టపడే ప్రేక్షకులను ఈ సినిమా మరో లోకంలోకి తీసుకెళ్తుంది. అయితే, ‘జాను’ కూడా ఆ మ్యాజిక్‌ను కొనసాగించిందని అంటున్నారు ప్రేక్షకులు. యూఎస్‌లో ఇప్పటికే ‘జాను’ ప్రీమియర్లు ప్రారంభమయ్యాయి. అక్కడ సినిమా చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. ‘జాను’ ఫస్టాఫ్ కాస్త స్లోగా ఉన్నా మ్యాజిక్‌ను మాత్రం కచ్చితంగా ఫీలవుతారని ఒక ప్రేక్షకుడు ట్వీట్ చేశారు. సమంత, శర్వానంద్ అద్భుతంగా చేశారట. లైఫ్ ఆఫ్ రామ్ సాంగ్‌తో సినిమా మొదలైందని, ఆ తరవాత వచ్చిన ప్రతి సన్నివేశం అద్భుతంగా ఉందని అంటున్నారు. ముఖ్యంగా ఫ్లాష్‌బ్యాక్‌లో స్కూల్ ఎపిసోడ్ చాలా బాగుందని చెబుతున్నారు. చిన్ననాటి జానకి, రామ్ పాత్రల ఎంపికలోనే దర్శకుడు సగం విజయం సాధించేశారని కొనియాడుతున్నారు. డైరెక్టర్ ఎలాంటి మార్పులు లేకుండా ‘96’కు దించేశారట. మొత్తం మీద ప్రస్తుతానికి ‘జాను’కు పాజిటివ్ టాక్ వినిపిస్తోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3bk72tq

No comments:

Post a Comment

'I Want To See Myself As Johnny Depp'

'I don't think I ever lost the confidence as an actor.' from rediff Top Interviews https://ift.tt/JMxUyhe