Thursday, 22 August 2019

Valmiki Song: ‘జర్ర జర్ర’ సాంగ్ ప్రోమో.. సూపర్ హిట్టు నో డౌటు!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ భయంకరమైన గ్యాంగ్ స్టర్‌గా నటిస్తోన్న చిత్రం ‘వాల్మీకి’. పూజా హెగ్డే హీరోయిన్. తమిళ నటుడు అధర్వ మురళి కీలక పాత్రలో నటిస్తున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం సమకూరుస్తున్నారు. అయానక బోస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. తమిళ సినిమా ‘జిగర్తాండ’కు ఇది రీమేక్. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్, టీజర్ విశేషంగా ఆకట్టుకున్నాయి. వీటిలోని వరుణ్ తేజ్ కిల్లింగ్ లుక్ మెగా అభిమానులను ఊపేస్తుంది. తాజాగా విడుదలైన ‘వాల్మీకి’ పాట ప్రోమో అయితే మాస్ ఆడియన్స్‌ను ఉర్రూతలూగించేలా ఉంది. ‘జర్ర జర్ర’ అంటూ సాగే ఈ ఐటమ్ సాంగ్‌ ప్రోమోను చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా గురువారం విడుదల చేశారు. ఇప్పటికే బయటికొచ్చిన రఫ్ లుక్‌లోనే వరుణ్ తేజ్ ఈ పాటలో కనిపించారు. ‘అభినేత్రి 2’లో నటించిన డింపుల్ హయాతి ఈ పాటలో నర్తించింది. భాస్కరభట్ల రవికుమార్ సాహిత్యం అందించిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి, ఉమా నేహ ఆలపించారు. మిక్కీ జే మేయర్ స్టైల్‌కి విరుద్ధంగా మంచి మాస్ బీట్‌తో ఉంది ఈ పాట. డింపుల్ హయాతి తన అందాలతో పాటను ఒక ఊపు ఊపేసింది. ‘సూపరు హిట్టు నీ హైటు.. సూపరు హిట్టు నీ రూటు.. సూపరు హిట్టు హెడ్డు వెయిటు.. సూపరు హిట్టు బొమ్మ హిట్టు’ అనే లైన్స్ అదిరిపోయాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2ZmpzSA

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....