సుమారు రూ. 350 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన సినిమా ‘సాహో’. తెలుగులో ఇంతటి భారీ బడ్జెట్‌తో యాక్షన్ థ్రిల్లర్‌ను రూపొందించడం ఇదే తొలిసారి. ఈ సినిమాకి ఎలాగూ ప్రేక్షకుల్లో పాజిటివ్ బజ్ ఉండనే ఉంది. అయితే ఎంత బజ్ ఉన్నప్పటికీ తొలివారం కలెక్షన్లపైనే సినిమా స్టామినా ఏంటన్నది తేలనుంది. ఏ మాత్రం తేడా వచ్చినా నిర్మాతలకు రూ. కోట్లు కోల్పోయే అవకాశం లేకపోలేదు. అందుకే హిట్టు మాట దేవుడెరుగు.. ముందు ఖర్చులొస్తే మహా ప్రసాదం అన్నట్టుగా.. కీలకమైన తొలివారంలో వీలైనంత కలెక్షన్లు రాబట్టేందుకు అన్ని ప్రయత్నాలనూ చేస్తోంది చిత్ర యూనిట్. ఇందులో భాగంగా టిక్కెట్ల రేట్ల పెంపుకు నిర్ణయించుకుంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ‘సాహో’ టిక్కెట్ల రేపు పెంపుపై అనుమతి కోరింది యూవీ క్రియేషన్స్. అయితే వీరి విజ్ఞప్తికి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ పెరిగిన ధరలకు అనుగుణంగా తొలివారం ‘సాహో’ ప్రదర్శితం అయ్యే థియేటర్లలలో టిక్కెట్ రేటు రెట్టింపు కానుంది. అంటే.. ప్రస్తుత టిక్కెట్ రేటు రూ. 100 ఉంటే.. రూ. 200 కానుంది. అయితే పెద్ద సినిమాలు విడుదలైనప్పుడు తొలివారంలో టిక్కెట్ రేట్లను పెంచడం.. దానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడం ఇదే తొలిసారి కాదు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా టిక్కెట్ల రేటును పెంచుకోవడానికి అనుమతిని ఇచ్చారు. ప్రభాస్‌కి బాహుబలి టైంలో కూడా అదనపు షోతో పాటు టిక్కెట్ రేటు పెంచుకోవడానికి అనుమతులు ఇచ్చారు. ఇప్పుడు జగన్ కూడా ప్రభాస్‌కి టిక్కెట్ రేట్లు పెంచుకునేందుకు నిర్మాతలకు బంబర్ ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం. అయితే ఈ పెరిగిన రేట్లు నిర్మాతలకు లాభం కాగా.. ప్రేక్షకులు జేబులకు చిల్లుపెట్టడమే. తొలివారంలో సినిమాకి వెళ్లిన ప్రేక్షకులకు అదనపు భారం కానుంది. ఇదిలా ఉంటే.. ఇటీవల ‘సాహో’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా జగన్ పాలనపై ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. నాకు రాజకీయాల గురించి పెద్దగా తెలియవు అంటూనే.. యంగ్ సీఎంగా ఆంధ్రప్రదేశ్‌ను జగన్ అభివృద్ధి పథంలో నడిస్తారనే నమ్మకమైతే ప్రజల్లో ఉంది. జగన్ బాగా పనిచేస్తున్నారని అన్నారు ప్రభాస్. ఇక ‘బాహుబలి’ చిత్రం తరువాత ప్రభాస్ ‘సాహో’లో నటించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్యాన్ ఇండియా చిత్రంగా ఈ సినిమాను ఐదు భాషల్లో ఆగస్టు 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శ్రద్దాకపూర్ నటిస్తుండగా.. రన్ రాజా రన్ ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహించారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2KRBXSG
No comments:
Post a Comment